ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టిడ్కో జాబితా మార్చిందెవరు?

ABN, Publish Date - Oct 29 , 2024 | 12:05 AM

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో గృహాలను అర్హులైన పట్టణ పేదలకు ఇచ్చామని ఎమ్మెల్యే, కమిషనర్‌, మున్సిపల్‌ చైర్మన్లు సంతకాలు పెట్టి జాబితా విడుదల చేశారని అటువంటి అర్హుల పేర్లు ఎలా మార్పు చేస్తారని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రశ్నించారు. సొమ్ములు చెల్లించిన వారిని ఎలా మార్పు చేస్తారని అన్నారు. లబ్ధిదారుల పేర్లు మార్చింది ఎవరో తెలియాలని, అవసరమైతే వారిపై లీగల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనందరావు

అమలాపురం టౌన్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో గృహాలను అర్హులైన పట్టణ పేదలకు ఇచ్చామని ఎమ్మెల్యే, కమిషనర్‌, మున్సిపల్‌ చైర్మన్లు సంతకాలు పెట్టి జాబితా విడుదల చేశారని అటువంటి అర్హుల పేర్లు ఎలా మార్పు చేస్తారని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రశ్నించారు. సొమ్ములు చెల్లించిన వారిని ఎలా మార్పు చేస్తారని అన్నారు. లబ్ధిదారుల పేర్లు మార్చింది ఎవరో తెలియాలని, అవసరమైతే వారిపై లీగల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. బోడసకుర్రులోని టిడ్కో గృహ సముదాయ పరిస్థితి విచిత్రంగా ఉందని అక్కడ నివాసం ఉంటున్న లబ్ధిదారులకు అక్కడే పంచాయతీ తరపున అన్ని సదుపాయాలు కల్పించే ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. ఎక్కడ ఇల్లు ఉంటే అక్కడే ఓటరుగా నమోదు చేయడంతో పాటు రేషన్‌కార్డులు బదిలీ చేయాలన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. టిడ్కోలో పట్టణ పేదలకు కాకుండా గ్రామాల్లో నివశిస్తున్న వారికి కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇల్లు కేటాయించారని కౌన్సిల్‌ అబ్బిరెడ్డి చంటి ఆరోపించారు. టిడ్కో గృహాలకు ఇంత వరకు పన్నులు వేయలేదని కమిషనర్‌ కేవీఆర్‌ఆర్‌ రాజు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఫ్లాట్ల కోసం లక్షలు రూపాయలు చెల్లించిన వారికి ఇంతవరకు ఎందుకు తిరిగి చెల్లించలేదని ఎమ్మెల్యే ఆనందరావు ప్రశ్నించారు. అమలాపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం చైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి అధ్యక్షతన సోమవారం వాడీవేడిగా జరిగింది. పట్టణంలోని 28, 29 వార్డులు పూర్తిగా స్లమ్‌ ఏరియాలు అయినప్పటికీ ఏవిధమైన చర్యలు తీసుకోవడం లేదని అధికార వైసీపీ కౌన్సిలర్‌ చిత్రపు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రూ.1.50 కోట్లతో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. జనరల్‌ ఫండ్‌ నిధులతో ఎక్కడా అభివృద్ధి పనులు చేపట్టిన దాఖలాలు లేవని కౌన్సిలర్‌ బొర్రా వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఇప్పటి వరకు 124 పనులకు టెండర్లు పిలవగా మూడు పనులకు మినహా మిగిలిన అన్ని పనులకు టెండర్లు ఖరారై సాంకేతిక మంజూరు ఇచ్చామని అధికారులు తెలిపారు. పురపాలక సంఘంలో జనరల్‌ ఫండ్‌కు సంబంధించి రెండు పద్దుల కింద రూ.93లక్షలు, రూ.1.20 కోట్లు ఉన్నాయని కమిషనర్‌ రాజు వివరించారు. అయితే గతంలో చేసిన పనులకు సంబంధించి రూ.9 కోట్లు బకాయిలు ఉన్నాయని అందుకే కాంట్రాక్టర్లకు నమ్మకం కుదరక పనులు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఓఎన్జీసీ నుంచి రూ.100 కోట్లు మంజూరు చేయాలని కోరామని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. ప్రధానంగా పట్టణంలో వంతెనల నిర్మాణానికి రూ.15 కోట్లు కేటాయించాలని కోరామన్నారు. అందరికీ ఆమోద యోగ్యమైన మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేసేందుకు జిల్లా కేంద్రమైన అమలాపురంలో రోడ్లు అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఓఎన్జీసీ వద్ద బెయిలీ బ్రిడ్జి ఉందని, దానిని ఈదరపల్లి వంతెన వద్ద ఏర్పాటు చేస్తే ట్రాఫిక్‌ సమస్య కొంతమేర తగ్గుతుందన్నారు. పురపాలక సంఘంలో ప్రధాన పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని కౌన్సిలర్‌ గొవ్వాల రాజేష్‌ పేర్కొన్నారు. చెరువుల ఆక్రమణల తీరుపై ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచర చెరువు గ్రామకంఠం భూమిపై ఇంత వరకు ఎందుకు సర్వే చేయలేదని దీనిపై కంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్టు కింద వెళ్లమంటారా అని అధికారులను హెచ్చరించారు. ఆక్రమణల సర్వేకు నెల రోజుల సమయం పడుతుందని కమిషనర్‌ రాజు వివరణ ఇచ్చారు. పురపాలక సంఘంలో గత ఇరవై ఏళ్లుగా ఫుడ్‌ సేఫ్టీ అధికారి లేకపోవడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు విమర్శించారు. జిల్లాల పునర్విభజన వల్ల ఇంతవరకు ఫుడ్‌సేఫ్టీ అధికారిని నియమించలేదని కమిషనర్‌ వివరణ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌, కౌన్సిలర్లు యేడిద శ్రీను, పిండి అమరావతి, గండి దేవిహారిక, మట్టపర్తి నాగేంద్ర, తిక్కా సత్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2024 | 12:05 AM