నేటి నుంచి సత్యదేవుడి దివ్యకల్యాణోత్సవాలు
ABN, Publish Date - May 18 , 2024 | 12:48 AM
రత్నగిరివాసుడైన సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మి అమ్మవారిని పరిణయమాడే వేళ సమీపిస్తోంది. ప్రతిఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున సత్యదేవుడి దివ్యకల్యాణం అంగరంగ వైభవంగా జరు గుతుండగా క్రోధి నామసంవత్సర కల్యాణోత్సవ వేడుకలు ఈసారి మే 18న ప్రారంభమై 24తో ముగియనున్నాయి.
19వ తేదీ రాత్రి దివ్యకల్యాణం ఫ 24 రాత్రి శ్రీపుష్పయాగంతో ముగింపు
వారం రోజులూ నిత్యం వివాహ వేడుకలు, కొండ దిగువ ఊరేగింపు
ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నూతన పెద్దరథంపై ఊరేగింపు
అన్నవరం, మే 17: రత్నగిరివాసుడైన సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మి అమ్మవారిని పరిణయమాడే వేళ సమీపిస్తోంది. ప్రతిఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున సత్యదేవుడి దివ్యకల్యాణం అంగరంగ వైభవంగా జరు గుతుండగా క్రోధి నామసంవత్సర కల్యాణోత్సవ వేడుకలు ఈసారి మే 18న ప్రారంభమై 24తో ముగియనున్నాయి. దీనికి దేవస్థానం అధికార యంత్రాంగం రూ.50 లక్షలను వెచ్చిస్తూ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆలయానికి రంగులు వేసి విద్యుద్దీపకాంతులతో దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. శనివారం సాయంత్రం సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెగా భక్తులను అనుగ్రహిస్తారు. స్వామి, అమ్మవార్ల వివాహ కార్యక్రమానికి క్షేత్రపాలకులు సీతారాములు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. కల్యాణమహోత్సవాలు వారంరోజులు కొండపై పెండ్లివేడుకలు, దిగువున వాహనసేవలు నిర్వహిస్తారు.
18న : వేకుజామున సుప్రభాతసేవ, చతుర్వేదపారాయణలు, సాయంత్రం 4 గంటలకు అనివేటి మండపంలో స్వామి, అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెగా అలంకరణ, రాత్రి 7 గంటలకు కళామందిరంలో ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 9 గంటలకు కొండదిగువున వెండి ఆంజనేయవాహనంపై సీతారాముల గ్రామోత్సవం జరుగుతుంది.
19న: సుప్రభాతసేవ, ఉదయం 9 గంటలకు అంకురార్పణ, ద్వజారోహణం, కంకణధారణ, రాత్రి 7గంటలకు కొండ దిగువున వెండి గరుడవాహనంపై పెండ్లికొడుకైన సత్యదేవుడు, వెండి గజవాహనంపై అనంతలక్ష్మి అమ్మవారు వెండి పల్లకీలో సీతారాముల ఊరేగింపు, గ్రామోత్సవం ఉంటుంది.
20న: సుప్రభాతసేవ, చతుర్వేదపారాయణలు, సాయంత్రం 5 గంటలకు ప్రధాన ప్రవేశస్థాలిపాక హోమాలు, రాత్రి 7గంటలకు అరుంధతీ నక్షత్రదర్శనం, రాత్రి 9 గంటలకు కొండదిగువున రావణబ్రహ్మ వాహనంపై నవదంపతుల గ్రామోత్సవం.
21న: సుప్రభాతసేవ, చతుర్వేదపారాయణలు, మధ్యాహ్నం 2.30కి అనివేటి మండపంలో క్షేత్రపాలకుల సీతారాముల సమక్షంలో సరస్వతీపూజ, పండిత సదస్యం, వేదశాస్త్ర సభ, పండిత సత్కారం రాత్రి 9గంటలకు కొండ దిగువున పొన్నవాహనంపై నవదంపతుల కు గ్రామోత్సవం.
22న: సుప్రభాతసేవ, చతుర్వేదపారాయణలు, సాయంత్రం 4గంటలకు కొండ దిగువన నవదంపతులకు వనవిహార మహోత్సవం. సాయంత్రం 5 గంటల నుంచి నూతన పెద్ద రఽథంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు జరుగుతుంది.
23న : సుప్రభాతసేవ, శేషహోమాలు, కొట్నాలు, గౌరీపూజను ఉదయం 5గంటలకు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు పంపా సరోవరంలో చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు నీలలోహిత గౌరీపూజ, నాకబలి, దండియాడింపు, ద్వజావరోహణ, కంకణ విమోచన ఉంటుంది.
24న: సుప్రభాతసేవ, చతుర్వేదపారాయణలు, రాత్రి 7.30కి కొండపై నిత్యకల్యాణమండపంలో శ్రీపుష్పయాగం. పేరంటాళ్ల కు దంపతీతాంబూలాలు, రవిక వస్త్రాల వితరణ ఉంటుంది.
Updated Date - May 18 , 2024 | 12:48 AM