మరుగుదొడ్ల వినియోగంపై చైతన్యం
ABN, Publish Date - Nov 20 , 2024 | 01:16 AM
శాంతికోసం ఒక ప్రదేశం అనే సందేశాత్మక నినాదంతో 2024లో మరుగుదొడ్ల వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలతో వెళుతున్నట్టు కలెక్టర్ పి.ప్రశాంతి చెప్పారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా నీరు, పారిశుధ్య కమిటీ చైర్‌పర్సన్, జిల్లా కలెక్టర్ అధ్య క్షతన జిల్లా గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం విభాగం సమావేశం నిర్వహించారు.
ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంలో కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం రూరల్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): శాంతికోసం ఒక ప్రదేశం అనే సందేశాత్మక నినాదంతో 2024లో మరుగుదొడ్ల వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలతో వెళుతున్నట్టు కలెక్టర్ పి.ప్రశాంతి చెప్పారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా నీరు, పారిశుధ్య కమిటీ చైర్‌పర్సన్, జిల్లా కలెక్టర్ అధ్య క్షతన జిల్లా గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం విభాగం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా గ్రామీణ, పట్టణ ప్రాం తాల్లో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరుచుకోవాలన్నారు. డీఆర్‌డీఏ ద్వారా మహిళలు, ప్రజ లను భాగస్వామ్యం చేసి మరుగుదొడ్ల వినియోగం పెంచాలన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ సామర్ధ్యం పెంచడం ద్వారా గ్రామ స్థాయిలో మెరుగైన ఫలి తాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామ పంచాయతీలు నిరంతరం పారిశుధ్య నిర్వహణ వ్యవస్థను మెరుగుపరుచుటలో పారిశుధ్య కార్మికులను ప్రోత్సహించాలన్నారు. సమాజ హితం కోరే వ్యక్తులుగా సమాజంలో ఆత్మ గౌరవ వ్యక్తులు శానిటరీ సి బ్బంది అని అన్నారు. ఈ సందర్భంగా టాయిలెట్ నిర్వహణ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలి చిన వారికి రూ.10 వేల నగదు పురస్కారం అందించాలని సూ చించారు. మరుగుదొడ్లపై అవ గాహన శిబిరాలను డిసెంబరు 10 తేదీ వరకు కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో పారిశుధ్యంలో చురుకైన పాత్ర పోషించిన కార్మికులు గంజే వీర మ్మ, నల్లేపు సింహాచలం, పేరంపల్లి వీరాస్వామి, ఎ.బేబి, మేరీ, విజయలను కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారి బీవీ గిరి, డీఎంహెచ్‌వో డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, డీ ఆర్‌డీఏ పీడీ ఎన్‌వీవీవీఎస్‌మూర్తి, ఇన్‌చార్జి జిల్లా పంచాయతీ అధికారి ఎం.నాగలత, డీఈవో కె.వాసుదేవరావు, జిల్లా భూగర్భ జల శాఖాధికారి వై.శ్రీనివాస్, ఐసీడీఎస్ పీడీ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ, ఇతర అఽధికారులు పాల్గొన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 01:16 AM