చివరికిలా!
ABN, Publish Date - Dec 04 , 2024 | 01:47 AM
ఆరుగాలం కష్టం చేతికి వచ్చే సమయంలో ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్న చందంగా రైతన్నల పరిస్థితి మారింది.
కోతలకు రైతులు దూరం
కోరుకొండలో లబోదిబో
90 శాతం పంట చేలోనే
కోరుకొండ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టం చేతికి వచ్చే సమయంలో ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్న చందంగా రైతన్నల పరిస్థితి మారింది. కోరుకొండ మండలంలో సుమారు 20 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం 90 శాతం వరకు కోతకు వచ్చింది. ఈ దశలో తుఫాన్ హెచ్చరికలు రావడంతో గత ఐదు రోజులుగా రైతులు వరికోతలను ఆపివేశారు. వాతావరణం మబ్బులు పెట్టి చిరుజల్లులు పడుతుండడంతో రైతాంగం భయ పడుతున్నారు. మండలంలో చాలా తక్కువ మంది రైతులు మాత్రమే వరి కుప్పలు వేశా రు. ఎక్కువ శాతం వరిపైరు దశలో ఉంది. కోరుకొండ మండలంలో లోతట్ట్టు గ్రామాలైన కోటి, శ్రీరంగపట్నం, రాఘవాపురం, కోటికేశవరం, బొల్లెద్దుపాలెం, మునగాల,బుచ్చింపేట గ్రామా ల్లో ముమ్మరంగా వరికోతలకు రైతులు సిద్ధ పడ్డారు.అయితే అధికారుల నుంచి వస్తున్న తుఫాన్ హెచ్చరికతో కోతలకు దూరంగా ఉన్నారు. మరికొన్ని రోజులు ఆగితే ధాన్యం రెల్ల విరిగి నేలపాలై దిగుబడి తగ్గిపోతుందని కోరుకొండ, జంబూపట్నం,నర్సాపురం,గాదరాడ,గోనగూడెం, బూరుగుపూడి, దోసకాయపల్లి గ్రామాల రైతు లు ఆందోళన చెందుతున్నారు.ఈ నేపధ్యంలో రైతులు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ప్ర భుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ధాన్యం బహిరంగంగా ఆరబెట్టొద్దు
పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాధిక
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆరుబయట ధాన్యం నిల్వలు పెట్టవద్దని పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాధికా సూచించారు. కోరుకొండ మండల పరిధిలో మంగళవారం ఆమె పర్యటించారు. ధాన్యం కోతలు నిర్వహించి బహిరంగ ప్రదేశాల్లో ఆరబెట్టిన ధాన్యపు నిల్వలు పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కోరుకొండ మండలం రాఘవపురం, బొల్లేద్దుపాలెం, పశ్చిమగోనగూడెం గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు.
Updated Date - Dec 04 , 2024 | 01:47 AM