ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అమలాపురం టౌన్‌ బ్యాంకు వ్యాపారం రూ.90కోట్లు

ABN, Publish Date - Jun 17 , 2024 | 12:37 AM

అమలాపురం కో-ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకు మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.90కోట్లు వ్యాపారం నిర్వహించినట్టు చైర్మన్‌ డాక్టర్‌ మెట్ల వెంకట సూర్యనారాయణ తెలిపారు.

అమలాపురంటౌన్‌, జూన్‌ 16: అమలాపురం కో-ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకు మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.90కోట్లు వ్యాపారం నిర్వహించినట్టు చైర్మన్‌ డాక్టర్‌ మెట్ల వెంకట సూర్యనారాయణ తెలిపారు. రూ.1.19కోట్లు లాభం వచ్చిందన్నారు. టౌన్‌బ్యాంకు 26వ వార్షిక మహాజన సభను ఆదివారం గండువీధిలోని డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావు కాపు కల్యాణ మండపంలో డాక్టర్‌ సూర్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. టౌన్‌ బ్యాంకులో రూ.50కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయని, వివిధ రంగాలకు రూ.39కోట్లు రుణాలుగా అందజేశామన్నారు. ఖాతాదారుల సహకారంతో టౌన్‌ బ్యాంకు ప్రగతిపథంలో నడుస్తోందన్నారు. ఈ ఏడాది సభ్యులకు 13శాతం డివిడెడ్‌ ప్రకటించామన్నారు. 2023-24ఆడిట్‌ రిపోర్టును, 2024-25, 2025-26 అంచనా బడ్జెట్‌లను బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిరగం వేణుగోపాలరావు ప్రవేశపెట్టగా మహాజన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈఏడాది పదో తరగతిలో అమలాపురం డివిజన్‌ స్థాయిలో అత్యత్తుమ మార్కులు సాధించిన తొమ్మిది మంది విద్యార్థులకు బ్యాంకు చైర్మన్‌, డైరెక్టర్లు నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. వైస్‌ చైర్మన్‌ ఎండీ అమీర్‌, డైరెక్టర్లు ఎంకే నాయుడు, డాక్టర్‌ గోదశి గంగరాజు, డాక్టర్‌ ఆకెళ్ల వెంకట్రావు, డాక్టర్‌ గొలకోటి రంగారావు, అల్లాడి శ్రీనివాస్‌, చింతా శంకరమూర్తి, పి.జాన్‌పాల్‌, నూలు సురేష్‌, శిరగం వేణుగోపాలరావు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:37 AM

Advertising
Advertising