గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి
ABN, Publish Date - Nov 18 , 2024 | 01:06 AM
మం డలంలోని గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధు లు, అధికారులు కృషి చేయాలని ఎంపీపీ కేవీకే దుర్గారావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.
దేవరపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ దుర్గారావు
దేవరపల్లి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధు లు, అధికారులు కృషి చేయాలని ఎంపీపీ కేవీకే దుర్గారావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. మండలంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పనులు నాణ్యంగా చేసేటట్టు అధికారులు చూడాల న్నారు. పీఆర్‌ఏఈ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌జీఎస్ పథకం ద్వారా మండలంలో రూ.2 కోట్లతో పనులు జరుగుతున్నా య న్నారు. ఆర్‌డబ్య్లూఎస్ ఏఈ కుమారి మాట్లాడుతూ మండ లంలో 13 అంగన్వాడీ కేంద్రా లకు మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. పశుసంవర్థక శాఖ పి.నేత్రాలమ్మ మాట్లాడుతూ పశుగణనకు రైతుల సహకరిం చాలన్నారు. విద్యుత్‌శాఖ ఏఈ వెంకట్రావు మా ట్లాడుతూ దేవరపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో దేవర పల్లి టౌన్ ఫీడర్‌ను రెండుగా విభజిస్తున్నామని, దాని కోసం ప్రత్యేకంగా కొత్తలైన్లు, స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీని వల్ల లోఒల్టేజీ సమస్య తీరుతుందన్నారు. ఎలక్షన్‌కోడ్ అమలులో ఉన్నందున ఏవిధమైన హామీలు ఇవ్వకుండా సభను ముగించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ కోర్లపాటి అరుణ, సాదే సుబ్బా రావు, ఎంఈవో తిరుమలదాసు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 18 , 2024 | 01:06 AM