‘ఓటు వేసి ఆశీర్వదించండి’
ABN, Publish Date - Mar 17 , 2024 | 11:55 PM
తొండంగి, మార్చి 17: అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడే టీడీపీ, జనసేన కూటమిని బలపర్చి తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని తుని నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య ప్రజలను కోరారు. ఆదివారం ఆమె బెండపూడిలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంచి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
తొండంగి, మార్చి 17: అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడే టీడీపీ, జనసేన కూటమిని బలపర్చి తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని తుని నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య ప్రజలను కోరారు. ఆదివారం ఆమె బెండపూడిలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంచి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతకు ఉపాది అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే తమ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు యనమల శివరామకృష్ణ, యనమల రాజేష్, పేకేటి హరికృష్ణ, సాధనాల నూకరాజు, పాలచర్ల యర్రబ్బు, గోపాలం, కోరుకొండ శివ, టీడీపీ, జనసేన పార్టీల తొ ండంగి మండలాధ్యక్షులు చొక్కా అప్పారావు, బెండపూడి నాయుడు తదితరులున్నారు.
Updated Date - Mar 17 , 2024 | 11:55 PM