ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇద్దరు ఘరానా దొంగలు అరెస్టు.. చోరీ సొత్తు స్వాధీనం

ABN, Publish Date - Jun 03 , 2024 | 12:52 AM

యానాం మున్సిపాల్టీ మెట్టకుర్రు వార్డు పరిధిలో గణపతినగర్‌లో నాలుగు రోజులు క్రితం, నవాజ్‌ కాలనీలో పది రోజుల క్రితం ఇద్దరు దొంగలు తాళాలు వేసి ఉన్న రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడి టీవీలు, సిలిం డర్లను అపహరించారు.

యానాం, జూన్‌2: యానాం మున్సిపాల్టీ మెట్టకుర్రు వార్డు పరిధిలో గణపతినగర్‌లో నాలుగు రోజులు క్రితం, నవాజ్‌ కాలనీలో పది రోజుల క్రితం ఇద్దరు దొంగలు తాళాలు వేసి ఉన్న రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడి టీవీలు, సిలిం డర్లను అపహరించారు. వీటిపై బాధితులకు యానాం పోలీ సులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీ సులు ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. ఆదివారం చోరీలకు సంబం ధించి వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఇందుకు సంబదించిన వివరాలను యానాం ఎస్పీ మీడియాకు వివరించారు. యానాం సీఐ షణ్ముగం ఆధ్వర్యంలో ఎస్‌ఐ మురగనందం శనివారం కాకినాడకు చెందిన చిప్పల దుర్గాప్రసాద్‌, యానాం మున్సిపాల్టీ మెట్టకుర్రుకు చెందిన డొంక వీరబాబులను అరెస్టు చేసినట్టు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1.37లక్షల విలువైన దివాన్‌కాట్‌, మూడు గ్యాస్‌ సిలిండర్లు, మూడు ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌మిషన్‌, గ్యాస్‌స్టవ్‌, మిక్సర్‌, ఐరాన్‌ బాక్సు, ట్రాలీ బ్యాగ్‌, ఫ్రిడ్జి, ల్యాప్‌ట్యాప్‌, టేబుల్‌ఫ్యాన్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులకు కోర్టు రిమాండ్‌ విధించిందన్నారు. చోరీ కేసులను ఛేదించిన పోలీసు, క్రైం సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలిపారు. కాకినాడ నుంచి గుట్కా ప్యాకెట్లను తీసుకువచ్చి యానాంలో విక్రయిస్తున్న కోలంకకు చెందిన వాకపట్లా శివను అరెస్టు చేసినట్టు ఎస్పీ తెలిపారు. రూ.15,875 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడికి కోర్టు రిమాండ్‌ విధించింది.

Updated Date - Jun 03 , 2024 | 12:52 AM

Advertising
Advertising