ఉప్పాడ తీరంలో అలల ఉధృతి
ABN, Publish Date - Dec 02 , 2024 | 12:12 AM
కొత్తపల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో ఆదివారం కూడా కెరటాల ఉధృతి కొనసాగు తూనే ఉంది. సాధారణ స్థాయి కం
బీచ్‌రోడ్డును తాకుతున్న కెరటాలు
కొత్తపల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో ఆదివారం కూడా కెరటాల ఉధృతి కొనసాగు తూనే ఉంది. సాధారణ స్థాయి కంటే 2 నుంచి 3 మీటర్ల ఎత్తులో ఎగసిపడిన రాకాసి అలలు ఉప్పాడ-నేమాం మధ్య బీచ్‌రోడ్డుపైకి దూ సుకొస్తున్నాయి. సు బ్బం పేట, కొత్తపట్నం, విద్యు త్ ప్లాంటు ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున గాలి లో లేస్తూ బీచ్‌రోడ్డును బలంగా తాకుతున్నాయి. దీంతో రోడ్డుకు అడుగు భాగంలో ఉన్న కంకర రా ళ్లు రోడ్డుపైకి విసిరేసినట్టు ఎగిరిపడుతున్నాయి. పెద్ద వంతెన సమీపంలో నిర్మించిన అప్రోచ్ వంతెన రోడ్డుపై సముద్ర కెరటాలు విరుచుకుప డుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడ ంతో బీచ్‌రోడ్డులో రాకపోకలను నియత్రించేం దుకు స్థానిక పోలీసులు చర్యలు చేపట్టారు.
Updated Date - Dec 02 , 2024 | 12:12 AM