విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశం వాయిదా
ABN, Publish Date - Dec 13 , 2024 | 12:36 AM
కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 13న నిర్వహించ తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశం వాయిదా వేసినట్టు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకురాలు పి.జ్యోతిలక్ష్మీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అమలాపురం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 13న నిర్వహించ తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశం వాయిదా వేసినట్టు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకురాలు పి.జ్యోతిలక్ష్మీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రగతికి మూలమైన స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం ఉన్నందున మోనటరింగ్ కమిటీ సమావేశం వాయిదా వేసినట్లు చెప్పారు. కమిటీ సమావేశం తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియచేస్తామన్నారు.
Updated Date - Dec 13 , 2024 | 12:36 AM