ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కలపరు... వదలరు!

ABN, Publish Date - Nov 04 , 2024 | 12:49 AM

13 ఏళ్లుగా ‘ప్రత్యేక’ పాలన.. నేటికీ పంచాయతీల సంగతి అతీగతీ లేదు.. ప్రత్యేకాధి కారులు పట్టించుకోవడం లేదు..పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని గ్రామా ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న ట్టుగా ఉంది.

30 గ్రామాల్లో పాలన పడక

2011 నుంచి ఎన్నికల్లేవ్‌

ప్రత్యేక పాలనతో ఇబ్బందులే

అందని ఆర్థిక నిధులు

పన్నులపైనే ఆధారం

కుంటుపడిన అభివృద్ధి

కూటమి రాకతో ఆశలు

కార్పొరేషన్‌ (కాకినాడ), నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): 13 ఏళ్లుగా ‘ప్రత్యేక’ పాలన.. నేటికీ పంచాయతీల సంగతి అతీగతీ లేదు.. ప్రత్యేకాధి కారులు పట్టించుకోవడం లేదు..పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని గ్రామా ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న ట్టుగా ఉంది. దీనికి కారణం ఆయా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరగక ప్రత్యేకాధికారుల పాలనలో ఉండిపోవడమే. పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు పొందలేకపోతున్నారు. గ్రామాల్లో ఏ పనులు చేయాలన్నా పన్నులే ఆధారం. దీంతో ఆయా గ్రామాల్లో అభివృద్ధి పూర్తిస్థాయిలో కుంటుపడింది.

మూడుసార్లు ఎన్నికలు జరగలేదు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 1103 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో పాలకు ల్లేని పంచాయతీలు 30 ఉన్నాయి. ఆయా పంచాయతీలు 13 ఏళ్లుగా ప్రత్యేక పాలనలోనే ఉన్నా యి. 2006 ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.ఆ తర్వాత 2011లో ఎన్నికలు జరగాలి.ఆ 30 పంచాయతీల్లో మాత్రం ఎన్నికలు జరగలేదు. 2011 నుంచి ఆ పంచాయతీల్లో సర్పంచ్‌, పాలకవర్గాలు లేవు. దీంతో ఈ పంచాయతీల్లో ఇప్పటికీ ప్రత్యేకాధికారుల పాలనలోనే ఉన్నాయి. ప్రభుత్వం ఈ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేయడంలేదు. ఆయా పం చాయతీల్లో ఎన్నికలపై కొనసాగుతున్న సాంకేతిక, న్యాయపరమైన చిక్కులను తొలగించడం లేదు. దీంతో ఈ గ్రామాల్లో పాలన పడకేసింది. వివిధ శాఖల జిల్లా, మండల అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. స్పెషల్‌ ఆఫీసర్లు గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

స్వార్థ రాజకీయాలకు బలి..

మునిసిపాలిటీ, మునిసిపల్‌ కార్పొరేషన్లలో 30 పంచాయతీలను విలీనం చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటుంటే విలీనం చేస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటని ప్రజాప్రతినిధులు, నాయకులు వారి స్వార్థ రాజకీయాల కోసం విలీన ప్రక్రియను అడ్డుకుంటున్నారని విమర్శలు న్నాయి. పేరుకే ప్రత్యేకాధికారులైనా అధికార పార్టీ నేతలు, స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఈ గ్రామాల్లో పాలన సాగుతోంది. దీంతో గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా ఉంది. పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులకు దూరమవుతున్నాయి. అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. ప్రజలు చెల్లిస్తున్న పన్నులపైనే అభివృద్ధి పనులు ఆధారపడి ఉన్నాయి. ఈ పంచాయతీల్లో ఎన్నికల సమస్యకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ పరిష్కారం చూపిస్తారని ఆయా గ్రామాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తమ గ్రామ పంచాయతీల్లో సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఎన్ని కలు జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు.

ఎన్నికలకు దూరమైన పంచాయతీలివే..

కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్‌ మండల పరిధిలో ఆరు పంచాయతీలు. చీడిగ, రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి, ఇంద్రపాలెం, తూరంగి. తుని మండల పరిధిలో రేకవానిపాలెం, ఎస్‌. అన్నవరం, తాళ్లూరు, కుమ్మరిలోవ ఉన్నాయి.

తూర్పు గోదావరి జిల్లా : రాజమహేంద్రవరం రూరల్‌ పరిధిలో ధవళేశ్వరం, బొమ్మూరు, పిడింగొయ్యి, కోలమూరు, శాటిలైట్‌ సిటీ, కాతేరు, తొర్రేడు, హుకుంపేట, రాజవోలు, వెంకటనగరం... రాజానగరం మండలంలో నామవరం, వెలుగుబంద, చక్రద్వారబంధం, పాలచర్ల, దివాన్‌చెరువు. కడియం మండలంలో వేమగిరి, కోరుకొండ మండలంలో గాడాల, నిడిగట్ల, మధురపూడి, బూరుగుపూడి పంచాయతీలు ఉన్నాయి.

‘గ్రేటర్‌’ రాజమహేంద్రి ఎప్పుడో

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

గ్రేటర్‌ రాజమహేంద్రవరం కలగా మారింది. పరిసర గ్రామాల విలీన ప్రక్రియపై అయోమ యం నెలకొంది. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలో రాజమహేంద్రవరం రూరల్‌, కోరుకొండ, రాజానగరం మండలంలోని మొత్తం 22 గ్రామాలతో గ్రేటర్‌ రాజమహేంద్రవరం చేయాలని 2019కి ముందు తెలుగుదేశం ప్రభు త్వం ఆలోచన చేసింది. గ్రామాలను విలీనం చేసి 54 డివిజన్లతో గ్రేటర్‌ మునిసిపల్‌ కార్పొ రేషన మాస్టర్‌ ప్లాన కూడా సిద్ధం చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావ డంతో విలీన ప్రక్రియ మూలనపడింది. కేవలం కొన్ని గ్రామాలనే విలీనం చేసి డివిజన్ల సంఖ్య 54 నుంచి 52కు తగ్గించే ప్రయత్నం చేశారు. అదీ సాగలేదు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఎన్నికలు 2015లో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగాయి. మేయర్‌గా పంతం రజనీ శేషసాయి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆ పాలకవర్గం 2019 జూలై 2న ముగిసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలిచినా ఎన్నికల ఊసే ఎత్తలేదు. ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు జరిపి స్తారనే ప్రచారం జరుగుతోంది. విలీనం గ్రామా లతో కలిపి ఎన్నికలు జరపాలని కొందరు, పాత 50 డివిజన్లతోనే ఎన్నికలు జరిపితే బావుం టుందని కొందరు ఆలోచిస్తున్నట్టు సమాచారం. కానీ ప్రజలు మాత్రం గతంలో ప్రతిపాదించిన 22 గ్రామాలను కలిపి ఎన్నికలు నిర్వహిం చాలని కోరుతున్నారు. అలా జరిగితేనే వచ్చే పుష్కరాల నాటికి గ్రేటర్‌ రాజమహేంద్రవరం కల నెరవేరుతుందనే చర్చ మొదలైంది. ప్రస్తుతం తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ గ్రేటర్‌ కలలు కంటున్నారు. కొద్దిరోజుల కిందట సీఎం చంద్రబాబు వద్ద పలువురు ఎమ్మెల్యేలు గ్రామాల విలీనం, ఎన్నికల గురించి ప్రస్తావించినట్టు సమాచారం.

Updated Date - Nov 04 , 2024 | 12:49 AM