ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నీటి సంఘాలకు ఎన్నికలు

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:08 AM

సీఎం నారా చంద్రబాబునాయుడు మానస పుత్రిక నీటి సంఘాలకు చాలా కాలం తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ జారీ అయింది.

వచ్చే నెల 21 నుంచి ఎన్నికలు

29న ప్రాజెక్టు కమిటీలతో పూర్తి

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

సీఎం నారా చంద్రబాబునాయుడు మానస పుత్రిక నీటి సంఘాలకు చాలా కాలం తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ జారీ అయింది. 1997లో చంద్రబాబు నీటి సంఘాలను ప్రవేశపెట్టి, సుమారు రూ.5లక్షలలోపు ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పనులు చేసే హక్కును రైతు లకు అప్పగించిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం నీటి సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. చంద్రబాబు నాయకత్వంలో కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ నీటి సంఘాలను తెరమీదకు తెచ్చారు.ఉభయగోదా వరి జిల్లాల పరిధిలో 642 నీటి సంఘాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 113 నీటి యాజమాన్య సంఘాల ఎన్నికలకు నోటిఫి కేషన్‌-1ను జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్‌ పి. ప్రశాంతి తెలిపారు. ముందుగా ఆయా ప్రాం తాల్లో 8 నుంచి 10 మంది వరకూ రైతులు కలిసి ప్రాదేశిక నియోజకవర్గం (టీసీ) సభ్యులను ఎన్నుకుంటారు.వారు నీటి సంఘాల ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటారు. వీరు డ్రిస్టిబ్యూటరీ కమిటీలను ఎన్నుకుంటారు. ఈ కమిటీలన్నీ కలిసి ప్రాజెక్టు కమిటీలను ఎన్నుకుంటారు. వీటి ద్వారా రాజకీయ నిరు ద్యోగులకు కొన్ని పదవులు దక్కు తాయి.

1,2 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ

నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌-1ను సోమవారం విడుదల చేశారు. ఈనెల 31న ప్రాదేశిక నియోజకవర్గాల వివ రాలు ప్రచురిస్తారు. నవంబరు 1,2 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు.3న అభ్యంతరాలపై నిర్ణయం తీసుకుంటారు.అదే రోజు ప్రాదేశిక నియోజకవర్గాల తుది జాబితా ప్రకటిస్తారు. 6 నుంచి 11వ తేదీ వరకూ భూయజమానుల ఓటరు జాబితా తయారు చేస్తారు. 11 నుంచి 12 వరకూ వాటిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 13న భూయజమానుల తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు. 20న ప్రాదేశిక, నీటి సంఘాలు, డ్రిస్టిబ్యూటరీ. ప్రాజెక్టు కమిటీల ఎన్నికల ప్రక టన చేస్తారు. 21 నుంచి 23వ తేదీ వరకూ ప్రాదేశికనియోజకవర్గ సభ్యులు, నీటి యాజ మాన్య సంఘాల ఎన్నికలు నిర్వహిస్తారు. 24 నుంచి 26 వరకూ డిస్ర్టిబ్యూటరీ కమిటీ ఎన్నికలు, 27 నుంచి 29వ తేదీ వరకూ ప్రాజె క్టు కమిటీ ఎన్నికలు నిర్వహిస్తారు.

Updated Date - Oct 22 , 2024 | 01:08 AM