నీటి సంఘాల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
ABN, Publish Date - Oct 30 , 2024 | 12:24 AM
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పునరుద్ధరించిన నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని ఆయా శాఖల సిబ్బందిని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సాగునీటి సంఘాల ఎన్నికలపై అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు.
అమలాపురం టౌన్, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పునరుద్ధరించిన నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని ఆయా శాఖల సిబ్బందిని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సాగునీటి సంఘాల ఎన్నికలపై అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ భూ యజమానుల గుర్తింపు, ఓటరు జాబితా తయారీ కచ్చితంగా చేపట్టాలన్నారు. తొలి దశలో నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు రెండో దశలో డిస్ర్టిబ్యూటరీ కమిటీలు, మూడో దశలో ప్రాజెక్టు కమిటీ ఎన్నికల ప్రక్రియ చేపట్టాలన్నారు. మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ విధానాలను తప్పనిసరిగా అనుసరించాలన్నారు. దోషరహిత జాబితాలను రూపొందించాలన్నారు. ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని చెప్పారు. మండపేట తహసీల్దార్ తేజేశ్వరరావు అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. డీఆర్వో వి.మదన్‌మోహనరావు, ఆర్డీవోలు కె.మాధవి, పి.శ్రీకర్, డి.అఖిల, జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 30 , 2024 | 12:24 AM