ద్వారపూడిలో విగ్రహాల ఏర్పాటులో వివాదం
ABN, Publish Date - Sep 05 , 2024 | 12:10 AM
ద్వారపూడిలో అంబేడ్కర్, రంగా విగ్రహాల ఏర్పాటు విషయంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఏర్పడిన వివాదం కొనసాగుతోంది.
ఇరువర్గాలతో ఆర్డీవో సుధాసాగర్, డీఎస్పీ రామకృష్ణ చర్చలు
మండపేట,సెప్టెంబరు4: ద్వారపూడిలో అంబేడ్కర్, రంగా విగ్రహాల ఏర్పాటు విషయంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఏర్పడిన వివాదం కొనసాగుతోంది. మంగళవారం ద్వారపూడిలో ఫ్లైఓవర్ వంతెన సమీపంలో వున్న నాలుగు రోడ్ల జంక్షన్‌లో ఇద్దరు నేతల విగ్రహాలను పోటాపోటీగా ఏర్పాటు చేసేందుకు ఇరువర్గాలు మంగళవారం రాత్రి ప్రయ త్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తిరిగి రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో గ్రామంలో పోలీ సు పికెట్ కొనసాగుతుంది. బుధవారం విగ్రహాల ఏర్పాటు విషయంపై మరోసారి పోలీసు బందోబస్తు ఉన్నప్పటికి ఇరు వర్గాలకు చెందిన వారు పోటాపోటీగా విగ్రహాలు ఏర్పాటు చేసే వివాదాస్పద స్థలానికి చేరుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం రాత్రి ద్వారపూడిలో పరిస్థితిని సమీక్షించి ఇరువర్గాల మధ్య చర్చలు జరిపేందుకు రామచంద్రపురం ఆర్డీవో సుధాసాగర్, డీఎస్పీ రామకృష్ణ చేరు కున్నారు. ఇరువర్గాలతో స్థానిక పంచాయతీ కార్యాల యం వద్ద చర్చలు జరిపేందుకు చేసిన ప్రయత్నం ఫలించ లేదు. ఇరువర్గాలు భారీగా పంచాయతీ వద్ద విగ్రహ స్థలం వద్ద మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నడుమ చర్చలు జర గలేదు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఆర్డీవో కలెక్టర్‌కు వివరిం చారు. ఇరువర్గాలతో త్వరలో రామచంద్రపురం ఆర్డీవో కార్యాల యంలో చర్చలు జరుపుతామని ఆర్డీవో తెలిపారు.
Updated Date - Sep 05 , 2024 | 12:10 AM