ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాజ్‌వేఏదీ

ABN, Publish Date - Nov 11 , 2024 | 01:25 AM

మండలంలోని నెల్లిమెట్ల కాలనీ-నెల్లిమెట్ల గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రోడ్డు మధ్యలో ఉన్న కాజ్‌వే గతంలో వరద ఉధృతికి కొట్టుకుపోయింది.

రాజవొమ్మంగి నవంబరు 10 (ఆంరఽధజ్యోతి): మండలంలోని నెల్లిమెట్ల కాలనీ-నెల్లిమెట్ల గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రోడ్డు మధ్యలో ఉన్న కాజ్‌వే గతంలో వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో సుమారు 20 గ్రామాల ప్రజలు ప్రమాదకర రీతిలో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద నీరు అధికంగా కాజ్‌వే వద్దకు రావడంతో ఒకవైపు కొట్టుకుపోయి పక్కన చిన్న దారే మిగిలివుంది. సుమారు 20 గ్రామాల ప్రజలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రమాదభరితంగా ప్రయాణాలు చేయడంతో నిత్యం పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇళ్ల నిర్మాణ సామగ్రి తెచ్చేందుకు భారీ వాహనాలు ఈ దారిలో వెళ్లేందుకు అవకాశం లేదు. దీంతో మినీ వ్యాన్‌లకు అధిక మొత్తంలో సొమ్ములు చెల్లించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. కాజ్‌వే కొట్టుకుపోవడంతో ఏలేశ్వరం-తాళ్లపాలెం సర్వీసును ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. వరదల సమయంలో ప్రమాదాలు జరగకుండా చూసేందుకు మాత్రమే అధికారులు కాజ్‌వేకు ఇరువైపులా పహారా ఉంటున్నారు. వరదల అనంతరం ఏ ప్రమాదం జరిగిన వారికి పట్టదా అని దండకారణ్య విమోచన సమితి సౌత్‌ రీజియన్‌ ప్రెసిడెంట్‌, రంపచోడవరం ఆదివాసి జేఏసీ చైర్మన్‌ వంతు బాలకృష్ణ ప్రశ్నించారు. అత్యవసర సమయంలో మండల కేంద్రమైన రాజవొమ్మంగి వచ్చేందుకు కూడా ప్రమాదకరంగా ప్రయాణాలు చేయల్సి వస్తోంది. అధికారులు వెంటనే స్పందించి కాజ్‌వేకి తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని, పాలకులు శాశ్వత పరిష్కారం చూపాలని బాలకృష్ణ డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 11 , 2024 | 01:25 AM