ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాకపోకలకు ఇబ్బంది లేకుండా వంతెన నిర్మాణం

ABN, Publish Date - Oct 30 , 2024 | 12:57 AM

వాహనాల రాకపోకలకు ఎటు వంటి ఇబ్బందులు లేకుండా గోకవరంలోని ఠాణా సెంటర్‌ సమీపంలో వంతెన నిర్మాణం జరుగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఠాణా సెంటర్‌ సమీపంలో బ్రిటిష్‌ కాలం నాటి వంతెనను మంగళవారం ఆయన పరిశీలించారు.

వంతెన నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

  • జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

గోకవరం, అక్టోబరు29(ఆంధ్రజ్యోతి): వాహనాల రాకపోకలకు ఎటు వంటి ఇబ్బందులు లేకుండా గోకవరంలోని ఠాణా సెంటర్‌ సమీపంలో వంతెన నిర్మాణం జరుగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఠాణా సెంటర్‌ సమీపంలో బ్రిటిష్‌ కాలం నాటి వంతెనను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఠాణా సెంటర్‌లోని వంతెన 1905వ సంవత్సరంలో నిర్మించినదని, ఈ వంతెనతో వాహనదారులు, పాదచారులు చాలా ఇబ్బందులు పడుతున్నా రన్నారు. జాతీయ రహదారుల నిబంధనలు ప్రకారం వంతెన నిర్మాణం జరుగుతుందన్నారు. ఎటువంటి మలుపులు లేకుండా వంతెన నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులకు సూచించారు. అవస రమైతే సీఎం చంద్రబాబు సహకారంతో కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి బ్రిడ్జిని నూతన విధానంతో నిర్మిస్తామన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 12:57 AM