ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వలంటీర్లు లేకుండానే పింఛన్ల పంపిణీ

ABN, Publish Date - Oct 02 , 2024 | 12:22 AM

గ్రామ వలంటీర్లు లేకుండానే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 1వ తేదీనే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసినట్టు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పలుచోట్ల మంగళవారం జరిగింది.

బిక్కవోలు: బలభద్రపురంలో పింఛను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే నల్లమిల్లి

  • ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి.. ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల అందజేత

బిక్కవోలు/రంగంపేట, అక్టోబరు 1: గ్రామ వలంటీర్లు లేకుండానే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 1వ తేదీనే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసినట్టు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పలుచోట్ల మంగళవారం జరిగింది. బిక్కవోలు మండలం బలభద్రపురం, రంగంపేట మండలం జి.దొంతమూరులో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి పాల్గొని పలువురికి పింఛన్లు అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలంటీర్లు లేకుండా పింఛన్లు పంపిణీ చేయలేమని వైసీపీ నాయకులు అన్నారని, అయితే నాలుగు నెలలుగా కూటమి నాయకులు, సచివాలయ సిబ్బందితో మొదటిరోజునే 98శాతం పింఛన్ల పంపిణీ జరుగుతుందన్నారు. బిక్కవోలు మండలంలో 10,644 పింఛ నుదారుల కోసం ప్రభుత్వం రూ.4,50,55,000 ఖర్చు చేస్తోందన్నారు. కార్యక్రమాల్లో బలభద్రపురంలో నల్లమిల్లి వెంకటసుబ్బారెడ్డి, ఇందల వీరబాబు, ఎం పీడీవో జేఏ. ఝాన్సీ పాల్గొనగా ఆరికరేవులలో సర్పంచ్‌ రెడ్డి నాగవేణికుమారి, పందలపాకలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లు సబ్బారపు పద్మావతి, పడాల వెంకటరామారెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు.దొంతమూరులో టీడీపీ మండలాఽధ్యక్షుడు ఎలుగుబంటి సత్తిబాబు, జటప్రోలు వెంకటేశ్వర్లు, గిరజాల సత్తిబాబు, ఎంపీ డీవో పి.వెంకటరత్నం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

  • ప్రాధాన్య క్రమంలో హామీలు అన్ని అమలు: వాసు

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 1: స్థానిక 11వ డివిజన్‌లో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ప్రాధాన్య క్రమంలో అమలు చేస్తామన్నారు. వివిధ కారణాలతో తొలగించిన పింఛన్లు వారి అర్హత ఆఽధారంగా తిరిగి పింఛను అందించే ప్రక్రియ త్వరలోనే సీఎం చంద్రబాబు చేపడుతున్నారని చెప్పారు.

Updated Date - Oct 02 , 2024 | 12:22 AM