ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళల రక్షణ కోసం వన్‌స్టాప్‌ కేంద్రాలు

ABN, Publish Date - Oct 29 , 2024 | 12:17 AM

కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం వన్‌స్టాప్‌ కేంద్రాలను ప్రవేశ పెట్టిందని జేసీ టి.నిషాంతి తెలిపారు. అమలాపురం హౌసింగ్‌బోర్డు కాలనీలో మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో శిశుగృహ, వన్‌స్టాప్‌ సెంటర్లను ఏర్పాటుచేయగా సోమవారం జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హింసకు గురైన మహిళలు, ప్రైవేటు, బహిరంగ ప్రదేశాల్లో, కుటుంబంలో, కార్యాలయాల్లో మహిళలకు రక్షణగా నిలిచేందుకు వన్‌స్టాప్‌ కేంద్రాలు దోహద పడతాయన్నారు. శారీరక, లైంగిక, మానసిక, ఆర్థిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు మద్దతుగా నిలిచి ఈ కేంద్రాల ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తారన్నారు.

కేంద్రాన్ని ప్రారంభిస్తున్న నిషాంతి

అమలాపురం, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం వన్‌స్టాప్‌ కేంద్రాలను ప్రవేశ పెట్టిందని జేసీ టి.నిషాంతి తెలిపారు. అమలాపురం హౌసింగ్‌బోర్డు కాలనీలో మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో శిశుగృహ, వన్‌స్టాప్‌ సెంటర్లను ఏర్పాటుచేయగా సోమవారం జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హింసకు గురైన మహిళలు, ప్రైవేటు, బహిరంగ ప్రదేశాల్లో, కుటుంబంలో, కార్యాలయాల్లో మహిళలకు రక్షణగా నిలిచేందుకు వన్‌స్టాప్‌ కేంద్రాలు దోహద పడతాయన్నారు. శారీరక, లైంగిక, మానసిక, ఆర్థిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు మద్దతుగా నిలిచి ఈ కేంద్రాల ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తారన్నారు. 18 ఏళ్లలోపు వయసున్న బాలికలకు జువైనల్‌ జస్టిస్‌ పిల్లల సంరక్షణ కేంద్రం వన్‌స్టాప్‌ కేంద్రంతో అనుసంధానం చేసినట్లు చెప్పారు. నిరాదరణకు గురైన మహిళలకు తాత్కాలిక వసతిని ఏర్పాటుచేసి వారికి కౌన్సిలింగ్‌, మెడికల్‌ సౌకర్యం, ఉచిత న్యాయసేవలు అందిస్తారని చెప్పారు. గృహహింసకు గురయ్యే మహిళలు టోల్‌ఫ్రీ నంబరు 181కి ఫోన్‌చేసి పరిష్కారం పొందవచ్చునన్నారు. పిల్లలను దత్తత తీసుకోవాలని కోరుకునే తల్లిదండ్రులు ముందుగా తమ పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ ఎం.ఝాన్సీరాణి, సీడీపీవో వై.విజయశ్రీ, సూపరింటెండెంట్‌ రమణి, శిశుగృహ సిబ్బంది పాల్గొన్నారు.

31 నుంచి దీపం-2 పథకం

ఈ నెల 31 నుంచి దీపం-2 పథకం ప్రారంభం అవుతుందని జేసీ టి.నిషాంతి తెలిపారు. సోమవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ జి.వీరపాండ్యన్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం జేసీ మాట్లాడుతూ ఈ పథకం కింద ఈ నెల 31 నుంచి మార్చి నెలాఖరు వరకు సిలిండర్‌ బుక్‌ చేసుకునే వారికి ఉచితంగా అందజేయనున్నట్లు చెప్పారు. అయితే లబ్ధిదారులు ముందుగా సొమ్ములు చెల్లించాలని ఆ తర్వాత బ్యాంకు ఖాతాకు సొమ్ము జమ అవుతుందని తెలిపారు.

Updated Date - Oct 29 , 2024 | 12:17 AM