ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అలిసిన ప్రయాణం... ఆయువు తీసింది!

ABN, Publish Date - Dec 11 , 2024 | 12:34 AM

విహారయాత్ర విషాదాంతమైంది. చిమ్మ చీకటి ఆపై ‘అలిసి’న ప్రయాణం శాపంగా మారి ఆయువు తీసింది.. చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం సాగించే భార్యాభర్తలు, చక్కనైన ఇద్దరు కుమారులు..హాయిగా సాగిపోతున్న ఆ కుటుంబ ప్రయాణం మంగళవారం తెల్లవారుజామున కుదుపులకు గురైంది. భార్య, ఇద్దరు పిల్లలను పోగొట్టుకుని ఓ వ్యక్తి ఒంటరిగా మిగిలాడు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఉడిమూడి శివారు చింతావారిపేటలో మంగళవారం తెల్లవారుజామున ప్రధాన పంట కాల్వలోకి కారు దూసుకుపోయిన సంఘటన ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.

సంఘటనా స్థలంలో భార్య, కుమారుడి మృతదేహాల వద్ద విలపిస్తున్న విజయ్‌కుమార్‌

విహారయాత్ర విషాదాంతమైంది. చిమ్మ చీకటి ఆపై ‘అలిసి’న ప్రయాణం శాపంగా మారి ఆయువు తీసింది.. చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం సాగించే భార్యాభర్తలు, చక్కనైన ఇద్దరు కుమారులు..హాయిగా సాగిపోతున్న ఆ కుటుంబ ప్రయాణం మంగళవారం తెల్లవారుజామున కుదుపులకు గురైంది. భార్య, ఇద్దరు పిల్లలను పోగొట్టుకుని ఓ వ్యక్తి ఒంటరిగా మిగిలాడు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఉడిమూడి శివారు చింతావారిపేటలో మంగళవారం తెల్లవారుజామున ప్రధాన పంట కాల్వలోకి కారు దూసుకుపోయిన సంఘటన ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.

తెల్లవారేదాకా ఆగితే ప్రాణాలు మిగిలేవి

పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు

ప్రమాదంలో భార్య, కుమారుడిని

పోగొట్టుకుని ఒంటరైన వ్యక్తి

కుటుంబం కన్నీరుమున్నీరు

పి.గన్నవరం మండలం

పోతవరంలో విషాదఛాయలు

పి.గన్నవరం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పోతవరం గ్రామానికి చెందిన నేలపూడి విజయ్‌కుమార్‌ భార్య ఉమా (32), కుమారుడు రోహిత్‌(9) కారు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. మనోజ్‌ (5) అనే మరో కుమారుడు కాల్వలో గల్లంతయ్యాడు. కేవలం 5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే వారు గమ్య స్థానానికి వెళ్లిపోయేవారు. ఇదంతా పదిహేను నిమిషాల ప్రయాణం అంతే..కానీ మృత్యువు వారిని క్షేమంగా ఇంటికి చేరనీయలేదు. చిమ్మ చీకటి, ఆపై మంచు ఈ సమయంలో రోడ్డు ప్రయాణం ఎంత ప్రమాదమో ఈ ఘటన చాటిచెప్పింది.

చక్కని కుటుంబం..హాయిగా సాగే జీవితం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పోతవరం గ్రామానికి చెందిన నేలపూడి విజయ్‌ కుమార్‌ బీఎస్సీ, బీఈడీ చదివాడు. కొవిడ్‌ ముందు వరకు ఓ ప్రైవేటు పాఠశాలలో పాఠాలు చెప్పుకుని జీవనం సాగించేవాడు. లాక్‌డౌన్‌ ప్రభావంతో వచ్చిన ఇబ్బందులతో ఉద్యోగం మానేసి ఓ కారు కొనుగోలు చేసి స్థానికులకు డ్రైవింగ్‌ నేర్పుతూ, మధ్య మధ్యలో కిరాయిలకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. విజయ్‌కుమార్‌ భార్య ఉమాకు కూడా డ్రైవింగ్‌ రావడంతో ఆమె కూడా మహిళలకు డ్రైవింగ్‌ నేర్పుతూ భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. వారికి రోహిత్‌ (మూ డో తరగతి), మనోజ్‌ (యూకేజీ) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. డ్రైవింగ్‌ నేర్పుతూ వచ్చే కొద్ది పాటి ఆదాయంతో ఈ కుటుంబం ఆనందంగా జీవిస్తోంది. కష్టపడి పనిచేసుకోవడం కొన్ని డబ్బులు దాచుకుని కుటుంబం అంతా కలిసి బయటకు వెళ్లడం ఇలా సాగుతోంది వారి జీవిత ప్రయాణం..కానీ ఒక్క ప్రమాదం ఆనందకరమైన కుటుంబంలో విషాదాన్ని నింపింది. తేరుకోలేనంతగా దెబ్బతీసింది. విజయ్‌కుమార్‌ వైజాగ్‌ నుం చి నిరంతరాయంగా కారు నడుపుతూ రావడం వల్ల అలసిపోయి ఈతకోట దగ్గర ఆగిపోయాడు. అలా వారు తెల్లవారే దాకా అక్కడే ఉండి కారులో విశ్రాంతి తీసుకున్నా, ఈతకోటలో ఉన్న తమ బంధువులు ఇంటికెళ్లినా ప్రాణాలు మిగిలేవని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు కుటుంబం చిన్నాభిన్నం కావడంతో విజయ్‌కుమార్‌ తల్లిదండ్రులు వీరవెంకట సత్యనారాయణ, లక్ష్మి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

బతికే అవకాశం వచ్చి..చేజారి..

కారు పంట కాల్వలోకి దూసుకెళ్లిన తర్వాత విజయ్‌కుమార్‌ వెంటనే తేరుకుని వెనుక డోర్‌ను ఓపెన్‌ చేసి బయటకు వచ్చాడు. ఆ సమయంలో భార్య ఉమా, ఓ కుమారుడిని అతికష్టం మీద ఒడ్డుకు చేర్చాడు. మరో కుమారుడు కోసం మళ్లీ నీటిలోకి వెళ్లాడు. అయితే ఇక్కడ కూడా అతడికి విధి సహకరించలేదు. ఒడ్డుకు చేరిన భార్య, కుమారుడు ఆ చిమ్మ చీకట్లో తెలియక కాలుజారి మళ్లీ అదే కాలువలో మునిగిపోవడం అత్యంత విషాదం. కుటుంబం మొత్తం నీటిలో మునిగిపోవడం, సాయం చేయడానికి ఒక్కరూ లేకపోవడం అయినా తానొక్కడే ఆ చీకట్లో నీటిలో రక్షించే ప్రయత్నం చేయడం.. కొన్ని నిమిషాల పాటు విజయ్‌కుమార్‌ భరించిన బాధ వర్ణనాతీతం.. ఈ ఘటనతో అతను షాక్‌కు గురయ్యాడు. ఒడ్డుకు చేర్చింది చిన్న కుమారుడో, పెద్ద కుమారుడో కూడా అతను చెప్పలేకపోయాడు. మరోవైపు భార్య, కుమారుడు మృతదేహాల వద్ద విజయ్‌కుమార్‌ రోదించిన తీరు కలచివేసింది.

చాలా బాధాకరం : ఎమ్మెల్యే గిడ్డి

చింతావారిపేట వద్ద జరిగిన ఘటన చాలా బాధాకరమైనదని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ప్రమాద ఘటన వివరాలను విజయ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Updated Date - Dec 11 , 2024 | 12:34 AM