యానాం విజన్‌డాక్యుమెంట్ అవసరం: జీఎన్ నాయుడు
ABN, Publish Date - Dec 15 , 2024 | 01:09 AM
యానాంలో దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం ఒక విజన్ డాక్యుమెంట్ తయారుచేయవలసిన అవసరముందని రీజెన్సీ సంస్థల చైర్మన్ డాక్టర్ జీఎన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
యానాం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): యానాంలో దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం ఒక విజన్ డాక్యుమెంట్ తయారుచేయవలసిన అవసరముందని రీజెన్సీ సంస్థల చైర్మన్ డాక్టర్ జీఎన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. 1985లో పుదుచ్చేరికి అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ కొన ప్రభాకరరావు, ముఖ్యమంత్రి ఫారుఖ్‌లతో పాటు ఏపీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావులను సంప్రదించడంతో సానుకూలంగా స్పందించి రీజెన్సీ సంస్థకు ప్రారంభ సమయంలో ఈక్విటీ షేర్ రూపంలో ఏపీఐడీసీ ద్వారా ఆర్థిక సహాయం అందించారన్నారు. తెలుగు ప్రజలను దృష్టిలో ఉంచుకుని వారి అభివృద్ధికి ప్రస్తుత గవర్నర్ కె.కైలాస్‌నాధ్, ముఖ్యమంత్రి రంగసామి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్‌రెడ్డిలతో యానాం ప్రాంత అభివృద్ధి పనుల గురించి ఒక కార్యాచరణను రూపొందించాలన్నారు. చంద్రబాబు రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌కు మంచి గుర్తింపు వచ్చిందని, యానాం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం విజన్ డాక్యుమెంట్ తయారుచేయవలసిన అవసరముందన్నారు.
Updated Date - Dec 15 , 2024 | 01:09 AM