ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫ్యాన్స్‌ గల్లంతు!

ABN, Publish Date - Nov 16 , 2024 | 01:38 AM

ఫ్యాన్‌ గాలి మారింది..రెక్కలు ఒక్కొక్కటిగా ఎగిరిపోతున్నాయి.. జిల్లాలో వైసీపీ ఖాళీ అయి పోతుంది.. ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో ఫ్యాన్‌ రెక్కలు విరిగిపడ్డాయి.

కూటమిలో చేరేందుకు సిద్ధం

టచ్‌లో ఉంటున్న వైసీపీ నేతలు

కొవ్వూరు, నిడదవోలులో షాక్‌

అనపర్తిలోనూ పెరిగిన చేరికలు

అదే బాటలో మరికొందరు

నిడదవోలులో జనసేన వైపు?

తూర్పున ఫ్యాన్‌ పని ఖాళీ

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ఫ్యాన్‌ గాలి మారింది..రెక్కలు ఒక్కొక్కటిగా ఎగిరిపోతున్నాయి.. జిల్లాలో వైసీపీ ఖాళీ అయి పోతుంది.. ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో ఫ్యాన్‌ రెక్కలు విరిగిపడ్డాయి. మిగిలిన నియోజక వర్గాల్లోనూ అదే పరిస్థితి ఉంది. అవకాశం వస్తే జారుకునేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వైసీపీ డీలా పడింది. ఎన్ని కల తర్వాత అనేక మంది వైసీపీని వీడిన సం గతి తెలిసిందే.అయితే ఇప్పటి వరకూ జిల్లాలో చోటా మోటా నాయకులే కూటమి బాట పట్టా రు. గురువారం ఏకంగా ప్రముఖ పారిశ్రా మిక వేత్త,గత వైసీపీ ప్రభుత్వంలో సలహాదా రు గా వ్యవహరించిన ఎస్‌.రాజీవ్‌కృష్ణ టీడీపీలో చేరడం తో అంచనాలు తారుమారయ్యాయి. స్థానిక ఎన్ని కలు వచ్చేలోపు వైసీపీ ఖాళీ అయిపోతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

వైసీపీ నుంచి క్యూ

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వైసీపీలో వివిధస్థాయిల్లో పనిచేసిన నేతలు తెలుగు దేశం, జనసేన, బీజేపీల్లో చేరడానికి అనేక ప్రయ త్నాలు చేస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో స్థానికంగా నెలకొన్న రాజకీయాల వల్ల కూట మిలో నేతలే అంగీకరించని పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ ఆయా నేతలు టచ్‌లో ఉన్నట్టు సమాచారం. కొవ్వూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఉమ్మడి పశ్చిమగో దావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కింగ్‌మేకర్‌గా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే దివంగత పెండ్యాల కృష్ణబాబు అల్లుడైన ఎస్‌.రా జీవ్‌కృష్ణ టీడీపీలో చేరడంతో ఇక వైసీపీ పరి స్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పార్టీ మారడంతో కార్యకర్తలు కూటమి వైపే చూస్తు న్నారు. రాజమహేంద్రవరంలో 2014లో ఎమ్మె ల్యేగా పోటీచేసి ఓడిపోయిన బొమ్మన రాజ్‌కు మార్‌ తనయుడు బొమ్మన జయకుమార్‌ కొద్ది నెలల కిందటే టీడీపీలో చేరడంతో పాటు జాం పేట కోఆపరేటివ్‌ అర్బన్‌బ్యాంక్‌ చైర్మన్‌గా కూడా ఎన్నికయారు.అంతకుముందు చల్లా శంకరరావు కూడా కూటమి మద్దతుతో ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ అయిన సంగతి తెలిసిందే. అన పర్తి నియోజకవర్గంలో పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీం తో ఆ నియోజకవర్గంలోనూ పార్టీ అంతంత మాత్రంగానే ఉంది. గోకవరం జడ్పీటీసీ దాసరి శ్రీరంగ అధికారికంగా టీడీపీలో చేరకపోయి నప్ప టికీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతోనే కలసి ఉం టున్న సంగతి తెలిసిందే. కోరుకొండ మం డలంలోని కాపవరం సర్పంచ్‌జాజుల రాము టీడీపీలో చేరారు. దేవరపల్లిలో వైసీపీ నేత మాధవరపు వెంకటేశ్వరరావు జనసేనలో చేరా రు. పోతుల కనకరాజు జన సేనలో చేరారు. అదే బాట లో కొవ్వూరు, నిడదవోలు మునిసిపల్‌ చైర్మన్లు ఉన్నా రు. ఇంకా చాలా నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు టీడీపీలో చేరే ప్రయత్నా లు చేస్తున్నారు. కొందరు నేతలు గాంభీర్యత ప్రదర్శిస్తున్నప్పటికీ వారికి ప్రత్యామ్నాయం లేక పోవడం వల్లే ఇంకా వైసీపీ గురించి మాట్లాడు తున్నారనే చర్చ కూడా మొదలైంది. వైసీపీ వైఖ రికి విసిగి పోయిన ప్రజలు జగన్‌, వైసీపీకి ఇక భవిష్యత్‌ లేదనే వాదన చేస్తున్నారు. ఎన్నికల తర్వాత జిల్లావ్యాప్తంగా కొందరు మౌనంగా ఉం డిపోయారు. సుమారు ఐదు నెలల్లోనే కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీల అమలు దిశగా ముందుకు వెళ్లడంతో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మ కం పెరిగింది.ఈ నేపథ్యంలో ఇక తమకు రాజ కీయ భవిష్యత్‌ ఉండదనే కారణంతో పలువురు వైసీపీ నేతలు కూటమి వైపు చూస్తున్నారు. అయితే స్థానిక కూటమి నేతలు మాత్రం తమ కు తెలియకుండా చేరికలు జరుగుతుండడంపై కినుక వహిస్తున్నారు.గత సంఘటనల నేపథ్యం లో సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

నిడదవోలులోనూ వైసీపీకి షాక్‌

పార్టీకి 11 మంది రాజీనామా

చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు

జిల్లా అధ్యక్షుడికి లేఖలు

జనసేనలో చేరేందుకు సిద్ధం?

పెరగనన్ను జనసేన బలం

నిడదవోలు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : నిడదవోలు నియోజకవర్గంలోనూ వైసీపీకి షాక్‌ తగిలింది. నిడదవోలు మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌,మరో తొమ్మిది మంది కౌన్సిలర్లు శుక్రవారం సాయం త్రం వైసీపీ సభ్యత్వానికి రాజీ నామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు పంపారు. వివిధ కారణాల వల్ల తామంతా వైసీపీ సభ్య త్వానికి రాజీనామా చేస్తున్నామని ఆమోదిం చాలని తమ లేఖ ద్వారా విన్నవించారు. అయితే తర్వాత ఏ పార్టీలో చేరుతున్నది వెల్లడించలేదు. జనసేనలో చేరనున్నట్టు సమాచారం. నిడద వోలు 25 వార్డు కౌన్సిలర్‌ ముని సిపల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారాయణ, 4వ వార్డు కౌన్సిలర్‌ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ గంగుల వెంకటలక్ష్మి, 3,7,9,10,11,18,23,24,28 వార్డుల కౌన్సిలర్లు వరు సగా ఎమ్‌.డి.షాజీరాబేగం, ముంగంటి మాణి క్యమాల, ఉసురుమర్తి జాన్‌ బాబు,ఆరుగొల్లు వెంకటేశ్వర్లు,చిలకల శారదా దేవి,సైదు చంద్ర శేఖర్‌,మద్దిపాటి నాగశ్రీ, మానుపాటి లక్ష్మి, ఆకుల ముకుందరావు తమ రాజీనామా లేఖ లను జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణకు పం పారు. వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు విధానాలతో గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్న మునిసిపల్‌ చైర్మన్‌ మరి కొందరు కౌన్సిలర్లు వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆంధ్రజ్యోతి ముందే కఽథనం ప్రచురించింది. ఇప్పుడు అదే నిజమైంది. ముని సిపల్‌ పాలకవర్గం వైసీపీని వీడడంలో జనసేన నాయ కుడు డాక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి కీలకపాత్ర పోషిం చినట్టు సమాచారం. త్వరలోనే మిగిలిన వైసీపి కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసే దిశగా ప్రణా ళిక సిద్ధం చేసినట్టు తెలిసింది.

కౌన్సిల్‌లో తగ్గిన వైసీపీ బలం

నిడదవోలు పురపాలక సంఘానికి 2021లో ఎన్నికలు జరగ్గా 27 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి విజయం సాధిం చారు. ప్రస్తుతం కౌన్సిల్‌లో 27 మంది సభ్యులు ఉన్న వైసీపీలో నేడు 11 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేయడంతో 16 మందికి వైసీపీ బలం పడిపోయింది. త్వరలో మరికొంతమంది వైసీపీ కౌన్సిలర్లు రాజీనామా బాట పట్టనుం డడంతో అతి త్వరలోనే నిడదవోలు మునిసిపల్‌ కౌన్సిల్‌ జనసేన పార్టీ కైవసం చేసుకోనుంది.

కూటమిలో చేరితే పదవులకు రాజీనామా చేయాలి : వైసీపీ

కొవ్వూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : వైసీ పీ నుంచి టీడీపీలో చేరిన నాయకులు తమ పదవులకు రాజీనామాచేయాలని వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ అన్నా రు. కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి తలారి వెంకట్రావు కార్యాలయంలో శుక్రవారం విలే కరులతో మాట్లాడారు. పార్టీని వీడిన వారంతా వైసీపీలో ఉంటూ గత ఎన్నికల్లో టీడీపీకి పనిచేశారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాజీవ్‌కృష్ణ ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి పార్టీని వీడి వెళ్లడం ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఏ కారణాలతో రాజీవ్‌ కృష్ణ పార్టీని వీడారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.ఈకార్యక్రమంలో కోడూరి శివరామకృష్ణ, ఎస్‌.సత్యనారాయణ, యు. సురిబాబు, పి. శ్రీలేఖ, ఎన్‌. శ్రీనివాస్‌, జి. సాయి, వి. సూరిబాబు,ఆలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 01:38 AM