ఏకాదశ రుద్రలు దర్శనం ఎంతో పుణ్యఫలం
ABN, Publish Date - Nov 12 , 2024 | 01:08 AM
కార్తీకమాసం సందర్భంగా అయినవిల్లి దేవస్థానం ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ప్రముఖ సినీ గేయ రచయిత, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, టీటీడీ మాజీ ఈవో, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రముఖ సినీ సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ, సంసృతాంధ్ర పండితులు పీటీబీవీ రంగాచార్యులు, గురుసహస్ర్తావధాని కడిమెళ్ళ వరప్రసాద్, సార్వభౌమ అచ్చతెలుగు అవధాని పాలపర్తి శ్యామలానందప్రసాద్ మండలంలోని ఏకాదశ రుద్రులను దర్శించున్నారు.
అంబాజీపేట, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం సందర్భంగా అయినవిల్లి దేవస్థానం ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ప్రముఖ సినీ గేయ రచయిత, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, టీటీడీ మాజీ ఈవో, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రముఖ సినీ సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ, సంసృతాంధ్ర పండితులు పీటీబీవీ రంగాచార్యులు, గురుసహస్ర్తావధాని కడిమెళ్ళ వరప్రసాద్, సార్వభౌమ అచ్చతెలుగు అవధాని పాలపర్తి శ్యామలానందప్రసాద్ మండలంలోని ఏకాదశ రుద్రులను దర్శించున్నారు. ప్రతి ఆలయం వద్ద ప్రముఖులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాల్లో వెలుగులు విరజిమ్మేలా ప్రజలను చైతన్యవంతులను చేయడానికే వెయ్యి గుడుల వెలుగు కోసం భక్తి చైతన్య సభ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇందుల్లో భాగంగా తెలుగు రాష్ర్టాల్లోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నట్టు చెప్పారు.ఈసందరద్భంగా జొన్నవిత్తుల మాట్లాడుతూ కార్తీకమాసంలో ఏకాదశ రుద్రులను దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోనసీమ ఏకాదశ రుద్రులకు సంబంధించి 11రుద్రులకు సంబంధించి 11పాటలను రచన చేస్తానన్నారు. తొలుత అయినవిల్లి శ్రీసిద్ధివినాయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బయలదేరారు. నేదునూరు, ము క్కామల, వక్కలంక, ఇరుసుమండ, పుల్లేటికుర్రు, వ్యాఘ్రేశ్వరం, కె.పెదపూడి, మొసలపల్లి, గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం, పాలగు మ్మి గ్రామాల్లో ఉన్న రుద్రులను దర్శించుకుని అనంతరం అప్పనపల్లి దేవస్ధానానికి చేరుకున్నారు.
Updated Date - Nov 12 , 2024 | 01:08 AM