ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:13 AM

దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో యువత కీలక బాధ్యతలు స్వీకరించాలని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన చెరువులోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎన్టీఆర్‌ కన్వెన్షన్‌లో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ (సెట్రాజ్‌) ఆధ్వర్యంలో యువజనోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

ప్రారంభ సభలో మాట్లాడుతున్న ఎంపీ పురందేశ్వరి

రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

నన్నయ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన యువజనోత్సవాలు

దివాన్‌చెరువు, సెప్టెంబరు 20: దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో యువత కీలక బాధ్యతలు స్వీకరించాలని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన చెరువులోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎన్టీఆర్‌ కన్వెన్షన్‌లో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ (సెట్రాజ్‌) ఆధ్వర్యంలో యువజనోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో యువశక్తి ఆస్తిగా ఉన్న దేశం భారత్‌ అన్నారు. నేడు ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదిగిన దేశాలు వృద్ధాప్య ఛాయలను కలిగి ఉండగా... భారతదేశం ఒక్కటే భవిష్యత్‌ అభివృద్ధికి కొలమానంగా ఉందన్నారు. దేశ జనాభాలో 50శాతం పైగా ఉన్న మహిళలను ప్రోత్సహించి వారికి సముచిత స్థానం కల్పించాల్సి ఉందని, కొంత మంది మహిళలు రక్తహీనత, ఎనీమియా, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. విశిష్ట అతిథి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి మాట్లాడుతూ యువతలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడే విజయాలు సాధ్యమవుతాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విజ్ఞతతో సద్వినియోగం చేసుకోవడంతో పాటు దేశాభివృద్ధిలో వాటి ద్వారా ఒనగూరే ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకురావడంలో యువత పాత్ర కీలకమన్నారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి కోరారు. మన సంస్కృతీ, సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు అందించడంలో ముఖ్య భూమిక వహించాలని కోరారు. యువజన సర్వీసుల శాఖ కమిషనరు పి.శారదాదేవి మాట్లాడుతూ జిల్లాస్థాయిలో విజేతలకు రాష్ట్రస్థాయికి ఎంపికవుతారన్నారు. అక్కడి నుంచి జాతీయ స్థాయికి పంపిస్తారన్నారు. తొలుత జ్యోతిప్రజ్వలనతో అతిథులు ఉత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో నన్నయ విశ్వ విద్యాలయం ఇనచార్జి ఉప కులపతి ఆచార్య వై.శ్రీనివాసరావు, సెట్రాజ్‌ కాకినాడ సీఈవో కేఎస్‌వీ కాశీవిశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:13 AM