ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గాజుగ్లాసు గుర్తుపై హైకోర్టు ఆదేశాలను ఈసీ తప్పుగా అర్థం చేసుకుంది

ABN, Publish Date - May 02 , 2024 | 04:41 AM

హైకోర్టు ఆదేశాలను అర్థం చేసుకుని జనసేన పార్టీ పోటీ చేయని స్థానాల్లో, ఆ పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇంకెవ్వరికీ కేటాయించవద్దని, గాజు గ్లాసు గుర్తును ఫ్రీజ్‌ చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తెలిపారు.

అందుకే మళ్లీ కోర్టుకు: టీడీపీ నేత వర్ల

అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాలను అర్థం చేసుకుని జనసేన పార్టీ పోటీ చేయని స్థానాల్లో, ఆ పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇంకెవ్వరికీ కేటాయించవద్దని, గాజు గ్లాసు గుర్తును ఫ్రీజ్‌ చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తెలిపారు. గురువారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌ కుమార్‌ మీనాను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ గాజుగ్లాసు గుర్తుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్నికల సంఘం తప్పుగా అర్థం చేసుకుందన్నారు. ఎక్కడైతే జనసేన పార్టీ పార్లమెంటుకు పోటీ చేస్తుందో ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న ఇతర పార్టీల అభ్యర్థులెవ్వరికీ గాజుగ్లాసు గుర్తు కేటాయించకూడదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఒక పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానంలోనైనా జనసేన పోటీ చేస్తున్నట్లయితే మిగిలిన 6 స్థానాలతోపాటు పార్లమెంటుకు పోటీ చేస్తున్న ఇతర పార్టీల అభ్యర్థులకు కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించకూడదని హైకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. కానీ ఎన్నికల సంఘం మాత్రం కోర్టు ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకుని జనసేన పోటీ చేయని ఏ స్థానంలోనైనా గాజు గ్లాసు గుర్తును ఎవరైనా కోరితే ఇస్తామని ప్రకటించిందన్నారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం తమకు డైరెక్షన్‌ ఇచ్చిందని సీఈవో చెబుతున్నారన్నారు. దీంతో తాము మళ్లీ కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. కూటమి విజయాన్ని ఆపాలని కొందరు ప్రయత్నిస్తున్నారని వర్ల ఆరోపించారు.

వైసీపీకి తొత్తులుగా అధికారులు

ఎమ్మెల్యేకు బంధువవడంతో వైసీపీకి ఓటు వేయండని అనంతపురంలో పనిచేస్తున్న డీఎస్పీ వీర రాఘవరెడ్డి బహిరంగంగా ప్రచారాలు చేస్తున్నారని, కనుక ఆయన్ను తక్షణమే ఎన్నికల విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. అసత్య ప్రచారాలు చేస్తున్న విశాఖపట్నం వైసీపీ ఎంపీ సత్యనారాయణపై కూడా చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరామన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరైనా టీడీపీకి ఓటు వేస్తే ఊరినించి బహిష్కరిస్తామని మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, కూటమి మేనిఫెస్టోను అన్ని వర్గాలు అభినందించారని, వైసీపీ మేనిఫెస్టోను ఎవ్వరూ నమ్మడంలేదని, కనీసం పట్టించుకోవడం లేదని వర్ల అన్నారు.

రాష్ట్ర భవిష్యత్‌ కోసమే కూటమికి మద్దతు: కేసన

భట్టిప్రోలు, మే 1: రాష్ట్ర ప్రజల భవిష్యత్‌, భావితరాల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కేసన శంకరరావు తెలిపారు. బుధవారం బాపట్ల జిల్లా భట్టిప్రోలులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో కూటమికి మద్దతుగా ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు చెప్పారు.

Updated Date - May 02 , 2024 | 04:41 AM

Advertising
Advertising