ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన

ABN, Publish Date - Jul 27 , 2024 | 03:24 AM

రాష్ట్రంలోని తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

అమరావతి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్‌ యాదవ్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబరు 1వ తేదీ నాటికి జాబితా రూపొందించేలా షెడ్యూల్‌ విడుదల చేయాలని నిర్ణయించినట్లు సీఈవో తెలిపారు. ఈ నెల 29న ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల రిజిస్ట్రేషన్‌కు ఈసీ నోటీసు విడుదల చేయనుంది. అదేవిధంగా శ్రీకాకుళం-విజయనగర ం- విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గానికి, కృష్ణా- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితాల్లో పేర్ల నమోదుకు 2024 సెప్టెంబరు 30న ఎన్నికల సంఘం నోటీసు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

Updated Date - Jul 27 , 2024 | 03:24 AM

Advertising
Advertising
<