ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆంధ్రకు ఈసీ ప్రత్యేక పరిశీలకులు

ABN, Publish Date - Apr 03 , 2024 | 03:04 AM

ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ర్టాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులను నియమించింది.

న్యూఢిల్లీ, అమరావతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ర్టాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ఏపీకి జనరల్‌ స్పెషల్‌ అబ్జర్వర్‌గా రామ్‌ మోహన్‌ మిశ్రా, పోలీస్‌ స్పెషల్‌ అబ్జర్వర్‌గా దీపక్‌ మిశ్రా, స్పెషల్‌ ఎక్స్‌పెండిచర్‌ అబ్జర్వర్‌గా నీనా నిగమ్‌లను కేటాయించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకు ప్రత్యేక పరిశీలనా బాధ్యతలను సార్వత్రిక ఎన్నికల ముందు ఈసీ అప్పగించడం పరిపాటే. తప్పుడు ప్రచారం, కల్పిత కథనాలు వ్యాప్తి చెందకుండా సత్వరం కళ్లెం వేయడం వీరికి అప్పగించిన ప్రధాన బాధ్యత. అలాగే, సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తారు. కాగా, ఏపీతోపాటు ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభలకు ఎన్నికలు జరుపుకొంటున్న ఒడిశాకు జనరల్‌ స్పెషల్‌ అబ్జర్వర్‌గా యోగేంద్ర త్రిపాఠి, పోలీస్‌ స్పెషల్‌ అబ్జర్వర్‌గా రజనీకాంత్‌ మిశ్రా, స్పెషల్‌ ఎక్స్‌పెండిచర్‌ అబ్జర్వర్‌గా హిమాలిని కశ్య్‌పలను ఎంపిక చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Updated Date - Apr 03 , 2024 | 08:35 AM

Advertising
Advertising