ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎడిట్‌ చేసి.. వక్రీకరించారు

ABN, Publish Date - Oct 10 , 2024 | 03:21 AM

కార్యకర్తలతో తాను మాట్లాడిన మాటలను ఎడిట్‌ చేసి, వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్‌ పత్రికపైనా, వైసీపీపైనా రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు.

జగన్‌ పత్రిక, వైసీపీపై మంత్రి నారాయణ ఫైర్‌

మద్యం టెండర్లపై ఎవరినీ బలవంతం

చేయలేదని వెల్లడి

నెల్లూరులో ఎవరైనా మద్యం వ్యాపారం చేసుకోవచ్చని వ్యాఖ్య

అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): కార్యకర్తలతో తాను మాట్లాడిన మాటలను ఎడిట్‌ చేసి, వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్‌ పత్రికపైనా, వైసీపీపైనా రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. కార్యకర్తలకు సపోర్ట్‌ చేస్తే తప్పా? అని నిలదీశారు. జగన్‌ పత్రిక, వైసీపీ వాళ్లు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మద్యం టెండర్ల విషయంలో వైసీపీ తనపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఎన్నికల్లో తన కోసం పని చేసిన కార్యకర్తలను ఆదుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు బెదిరించి బార్లు, మద్యం వ్యాపారాలను లాక్కున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లలో వ్యాపారం చేసుకోవాలంటే భయపడేవారన్నారు. మద్యం టెండర్లు వేయొద్దని తాను ఎవరినీ బలవంతం చేయలేదని, నెల్లూరులో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చని, మద్యం టెండర్లు వేసుకోవచ్చని స్పష్టం చేశారు. కార్యకర్తలతో తాను మాట్లాడిన మాటలను ఎడిట్‌ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కష్టపడిన కార్యకర్తలకు సంవత్సరానికి రూ.10 కోట్ల చొప్పున రూ.50 కోట్లు ఇస్తానని చెప్పానని, ఇప్పటికే రూ.2 కోట్లు ఇచ్చానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ వ్యాపారం చేయాలన్నా నెల్లూరులో 10 నుంచి 20శాతం వాటా ఇవ్వాల్సి వచ్చేదన్నారు. అందరూ వ్యాపారం చేసుకుని రాష్ట్రానికి ఆదాయం పెరగాలనేదే తమ ఉద్దేశమన్నారు. తమ ప్రభుత్వంలో ఎవరైనా వ్యాపారం చేయడానికి స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు. వైసీపీ నెల్లూరులో జీరో అయిపోతుందనే భయంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. 250 కుటుంబాలకు ఆదాయం వచ్చే నిర్ణయాన్ని అడ్డుకుని గతంలో నెల్లూరులో హోటల్‌ కట్టకుండా అడ్డుకున్నారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక గంటల్లోనే అనుమతులు ఇస్తున్నామని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరగడం సహా పలువురికి ఉపాధి కలుగుతుందన్నారు. నెల్లూరులో తాను అభివృద్ధి చేసుకుంటూ పోతే వైసీపీ జీరో అయిపోతుందన్న భయం వారిలో ఉందని ఎద్దేవా చేశారు.

Updated Date - Oct 10 , 2024 | 03:21 AM