ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MLA Pinnelli : మాచర్ల వెళ్లొద్దు

ABN, Publish Date - May 25 , 2024 | 04:22 AM

మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడి ్డ ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దు! నరసరావుపేట దాటి కాలుకదపొద్దు.

  • 6 వరకు నరసరావుపేటలోనే ఉండాలి

  • అనుచరులనూ కంట్రోల్‌లో ఉంచుకోవాలి

  • వారివల్ల ప్రజాశాంతికి భంగం కలగరాదు.. ఆ బాధ్యత పూర్తిగా మీదే

  • ఫలితాల రోజు మాత్రమే కౌంటింగ్‌ కేంద్రానికి అనుమతి

  • షరతులు ఉల్లంఘిస్తే పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు

  • మధ్యంతర బెయిల్‌లో పిన్నెల్లికి హైకోర్టు కఠిన ఆంక్షలు

అమరావతి, మే 24 (ఆంధ్రజ్యోతి): ‘‘మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దు! నరసరావుపేట దాటి కాలుకదపొద్దు. నోరు మెదపొద్దు’’ ఇవి హైకోర్టు విధించిన షరతుల సారాంశం. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో జూన్‌ 6 వరకు ఆయన అరెస్టును ఆపుతూ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆయనపై అనేక కఠినమైన షరతులు విధించింది. బెయిల్‌ కాలంలో పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రమైన నరసరావుపేటలోనే ఉండాలని స్పష్టం చేసింది. అంటే... ఆయన మాచర్లలో అడుగుపెట్టకూడదన్న మాట! ఓట్ల లెక్కింపు రోజు న ఆయన నరసరావుపేటలోని కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లొచ్చు. సాక్షులను కలవడం, వారిని ప్రభావితం చేయడం, భయపెట్టడం చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కేసుకు సంబంధించి ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాతో మాట్లాడడానికి వీల్లేదని షరతు విధించింది. నేర ఘటనలను పునరావృతం చేయవద్దని, వాటిలో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది.

తన అనుచరులు ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత రామకృష్ణారెడ్డిదేనని స్పష్టం చేసింది. పిన్నెల్లి కదలికలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు అతని పై నిఘా ఉంచేలా పోలీసు అధికారులను ఆదేశించాలని చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌కు స్పష్టం చేసింది. కోర్టు నిర్దేశించిన షరతులను ఉల్లంఘించినట్లైతే చట్టప్రకారం చర్యలు తీసుకొనేందుకు పోలీసులకు వెసులుబాటు ఇచ్చింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను జూన్‌ ఆరోతేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 13న పోలింగ్‌ సందర్భంగా ఈవీఎం, వీవీప్యాట్‌ను ధ్వంసం చేసిన వ్యవహారంలో పల్నాడుజిల్లా రెంటచింతల పోలీసులు తనపై నమోదుచేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం పై గురువారం అత్యవసరంగా విచారణ జరిపిన హైకోర్టు....పిన్నెల్లికి షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అందుకు సంబంధించిన తీర్పు ప్రతి శుక్రవారం అందుబాటులోకి వచ్చింది.


20 ఏళ్లుగా పిన్నెల్లి బ్రదర్స్‌ మారణహోమం: లోకేశ్‌

అమరావతి, మే 24(ఆంధ్రజ్యోతి): నరరూప రాక్షసులైన పిన్నెల్లి సోదరులు మాచర్ల నియోజకవర్గంలో 20 ఏళ్లుగా మారణ హోమం సాగిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ధ్వజమెత్తారు. ప్రజలు బతకాలన్నా, ప్రజాస్వామ్యం నిలవాలన్నా వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట రమణారెడ్డిలను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీకి మద్దతు ఇస్తున్నారనే కారణంతో ఊర్ల్లకు ఊర్ల్లు తగలబెడుతూ, కుటుంబాలను మట్టుపెడుతోన్న పిన్నెల్లి బ్రదర్స్‌ అరాచకాలకు చరమగీతం పాడాలని శుక్రవారం ఎక్స్‌లో లోకేశ్‌ పిలుపునిచ్చారు.

పిన్నెల్లి అరెస్ట్‌లో పోలీసుల కాలక్షేపం: వైవీబీ

తిరుమల, మే24(ఆంధ్రజ్యోతి): మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌ విషయంలో పోలీసులు కాలక్షేపం చేశారని మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌(వైవీబీ) ఆరోపించారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసినట్టు సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా రికార్డు అయ్యింది. ఆయన పరారు వెనుక పోలీసుల హస్తమున్నట్లుగా తెలుస్తోంది. ఆయన వాహనాలు, పీఏ, గన్‌మ్యాన్‌ దొరికారు కానీ పిన్నెల్లి, ఆయన తమ్ముడు దొరకలేదట. మూడురోజుల పాటు వెతుకుతున్నాం, వేటాడుతున్నామంటూ పోలీసులు కాలక్షేపం చేశారు’ అని విమర్శించారు. అలాగే, ‘ఈసీ దృష్టిలో ఇది చాలా సీరియస్‌ అంశం. అయినా అలాంటి వ్యక్తికి కోర్టులు ఎలా రక్షణ కల్పించాయో ఆశ్చర్యంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఈలోగా పిన్నెల్లి తనను అర్టెస్‌ చేయకూడదని కోర్డు నుంచి ఆర్డర్‌ తెచ్చుకున్నారన్నారు. ఇక, కూటమికి మెజార్టీ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు రావాలని, చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు.

దాడులుచేస్తూ కనిపిస్తే కేసులే పోల్‌ హింసపై సిట్‌ దర్యాప్తు వేగవంతం

నరసరావుపేట, మే 24 : పల్నాడు జిల్లాలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటలనపై సిట్‌ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఘటనలకు సంబంధించిన వీడియోలను సిట్‌ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. దాడులకు చేస్తూ వీడియోల్లో కనిపించిన వ్యక్తులపై కేసులు నమోదయ్యాయా లేదా అంటూ పోలీసు అధికారులను నిలదీస్తున్నారు. వీడియో దృశ్యాలలో కనిపించినవారి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఆ పేర్లు పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లలో ఉన్నాయా లేదా అనేది పరిశీలిస్తున్నారు. నరసరావుపేట పట్టణంలోని పోలీసు స్టేషన్‌ల్లో నమోదైన కేసుల రికార్డులను మరోసారి సిట్‌ అధికారి సౌమ్యలత శుక్రవారం పరిశీలించారు. ఘటనలకు సంబంధించిన వీడియోలను పరిశీలించారు. రెంటచింతల మండలంలో జరిగిన ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్‌ అధికారి రమణమూర్తి మరోసారి అక్కడి పోలీసు స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. కేసుల నమోదు జరిగిన తీరుపై పోలీసు అధికారులను ప్రశ్నించారు.

Updated Date - May 25 , 2024 | 08:36 AM

Advertising
Advertising