ఏలూరు టు చెన్నై
ABN, Publish Date - Oct 20 , 2024 | 01:20 AM
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మార్చురీ నుంచి మృతదేహం అపహరణపై వచ్చిన కథ నం శనివారం తీవ్ర కలకలం రేగింది.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగితోపాటు మిగిలిన వారి పాత్రపై విచారణ
మహిళా మృతదేహాలను పురుషులతో పోస్టుమార్టం
మృతదేహాల నమోదుకే పరిమితమైన అసిస్టెంట్లు
ఏలూరు క్రైం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మార్చురీ నుంచి మృతదేహం అపహరణపై వచ్చిన కథ నం శనివారం తీవ్ర కలకలం రేగింది. మెడికల్ కాలేజీ, ఆసుపత్రి అధికారులు దర్యాప్తు చర్యలు చేపట్టారు. ఈ నెల 8వ తేదీ రాత్రి మార్చురీ అసిస్టెంట్ అశోక్ మార్చురీ తాళాలు డ్యూటీలో ఉన్న మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నుంచి తీసుకుని ఒక అంబులెన్సు ద్వారా మృతదేహాన్ని తరలించారు. అనుమానం కల్గిన మహిళా ఉద్యోగిని అశోక్‌ను నిలదీసి అధికారులకు సమా చారం ఇవ్వడంతో కొంతసేపటికే మృతదేహాన్ని తిరిగి మార్చురీలో పెట్టేశారు. ఈ ఘటనపై ఆ మహిళా ఉద్యోగిని ఫిర్యాదు మేరకు ఫోరెన్సిక్ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ కె.భాస్కర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం.శశిధర్‌కు ఈ నెల 18న ఫిర్యాదు చేశారు. తీగలాగితే డొంక కదిలినట్లు మార్చురీ కథ మొదలైంది.
వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉన్న ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి మెడికల్ కళా శాల ఆధీనంలోకి వెళ్లిన తర్వాత ఆసుపత్రిలో ఎంత మంది మరణించారు. ఎన్ని మృతదే హా లు మార్చురీలో ఉంచారు. వాటిలో అనాథ మృతదేహాలు ఎన్ని అనే లెక్కలు తీసుకున్నారు. కొన్ని మృతదేహాలు హైదరాబాద్, చెన్నై, నంది గామ వంటి ప్రాంతాలకు తరలించారని తెలు స్తోంది. ఒక వైద్యుడు ఇతర ప్రాంతాల నుంచి అంబులెన్సులు తీసుకువచ్చి మృతదేహాలను పంపించేవారని సమాచారం. వాస్తవానికి అనా థ మృతదేహాలను ఆసుపత్రి అధికారులు, ఖన నం నిమిత్తం మున్సిపాల్టీకి అప్పగిస్తారు. సిబ్బంది వచ్చి వీటిని స్మశానానికి తరలించి రికార్డుల్లో నమోదు చేయించి ఖననం చేస్తారు. మార్చురీ నుంచి మున్సిపాల్టీకి అప్పగించే క్రమంలో వాటిని ఫోటో తీసి భద్రపర్చాలి. కాని, ఇంత వరకూ ఒక్క ఫోటో కూడా తీయ లేదు. గతంలో మార్చురీ వద్ద సీసీ కెమెరాలు ఉండగా మెడికల్ కాలేజీగా మారిన తర్వాత తొలగించారు. మృతదేహం తస్కరించే యత్నం తో ఖంగుతిన్న అధికారులు చర్యలు చేపట్టారు. మార్చురీ వద్ద సెక్యూరిటీ గార్డును నియమిం చారు. ఎన్ని మృతదేహాలు లోపలికి వస్తున్నా య్, ఎన్ని బయటకు వెళుతున్నాయి వంటి వివరాలు నమోదు చేస్తున్నారు. చెన్నైలోని ఒక మెడికల్ కళాశాలకు ఈ నెల 8న మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేసి నట్లు సమాచారం. మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ విభాగం హెచ్‌వోడీ కె.భాస్కర్‌ను వివరణ కోరగా తాము ప్రస్తుతం మృతదేహాల లెక్కలు చూస్తున్నామని, రికార్డుల న్ని పరిశీలించి ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో వివరాలు తెలియజేస్తామన్నారు.
ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం వచ్చే మహిళల మృతదేహాలను కోయడానికి నలుగు రు మహిళా సిబ్బందిని నియమించారు. వారు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒక్క మహిళా మృతదేహానికి పీఎం చేయించలేదు. కేవలం ఇద్దరు వ్యక్తులతోనే అన్నింటికి పోస్టుమార్టం జరిపించారు. ఈ నలుగురిని వచ్చిన మృత దేహాలను నమోదు చేయించడానికే పరిమితం చేశారు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Updated Date - Oct 20 , 2024 | 01:20 AM