ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాఘవేంద్రుని సన్నిధిలో ప్రముఖులు

ABN, Publish Date - Dec 08 , 2024 | 11:29 PM

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని ఆదివారం ప్రముఖులు దర్శించుకున్నారు.

కర్నాటక రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి చలువరాయస్వామి కి మెమెంటో ఇస్తున్న పీఠాధిపతి

మంత్రాలయం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని ఆదివారం ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చలువరాయస్వామి, ఏపీ హైకోర్టు జడ్జిలు జస్టిస్‌ న్యాపతి విజయ్‌, జస్టిస్‌ మహేశ్వరరావు కుంచెం వేర్వేరు సమయాల్లో రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. శ్రీమఠం మహాముఖ ద్వారం వద్ద మఠం మేనేజర్లు వెంకటేష్‌ జోషి, శ్రీపతి ఆచార్‌, ఐపీ నరసింహామూర్తిలు వీరికి ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు మెమెంటో, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షింతలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. వీరి వెంట మఠం సిబ్బంది అనంతపురాణిక్‌, జేపీ స్వామి,ఎస్‌ఐ పరమేష్‌ నాయక్‌, వ్యాసరాజార్‌,దేశాయి నరసింహ ఆచార్‌, ప్రకాష్‌ ఆచార్‌,రంగస్వామి, జయతీర్థ ఆచార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2024 | 11:29 PM