ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓట్ల కోసం ‘ఉపాధి’ గేలం

ABN, Publish Date - Apr 16 , 2024 | 03:28 AM

ఎప్పుడో ఇచ్చిన ఇళ్ల పట్టాలను ఎన్నికల ముందు మళ్లీ ఇవ్వడం, ఎప్పుడో జగనన్న సురక్ష పథకం ద్వారా ఇచ్చిన కుల ధృవీకరణ పత్రాలను మళ్లీ ఇచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడం... ఇలా జనాలకు తాము చేసిన పనులను ఎన్నికల ముందు గుర్తు చేయడం కోసం జగన్‌ సర్కార్‌ రకరకాల ఫీట్లు వేస్తోంది. ఈ క్రమంలోనే ఉపాధి

రైతుల పొలాల్లో పండ్ల మొక్కల పెంపకానికి నిధులు.. పేద రైతు ఓటర్లకు ఉపాధి నిధుల ఎర

ఎన్నికల ముందే భారీగా మంజూరుకు రంగం సిద్ధం

ఉపాధి పథకంలో పనిచేసే కీలక అధికారే సూత్రధారి

నాలుగేళ్లుగా పేద రైతులను పట్టించుకోని జగన్‌ సర్కార్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎప్పుడో ఇచ్చిన ఇళ్ల పట్టాలను ఎన్నికల ముందు మళ్లీ ఇవ్వడం, ఎప్పుడో జగనన్న సురక్ష పథకం ద్వారా ఇచ్చిన కుల ధృవీకరణ పత్రాలను మళ్లీ ఇచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడం... ఇలా జనాలకు తాము చేసిన పనులను ఎన్నికల ముందు గుర్తు చేయడం కోసం జగన్‌ సర్కార్‌ రకరకాల ఫీట్లు వేస్తోంది. ఈ క్రమంలోనే ఉపాధి హామీ పథకం నిధులను పేద రైతుల కోసం ఖర్చు చేసి, వారి ఓట్లను కొల్లగొట్టేందుకు వైసీపీ సర్కార్‌ ఎత్తులు వేస్తోంది. నాలుగేళ్లుగా ఉపాధి హామీ పథకం నిధులను ఉద్యాన పంటలకు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినా సర్కార్‌ పట్టించుకోలేదు. ఉపాధి పథకంలో మెటీరియల్‌ నిధులన్నీ జగనన్న కాలనీల చదును పనులకు వాడి కార్యకర్తలకు దోచిపెట్టిన జగన్‌ సర్కార్‌... ఇప్పుడు ఆ నిధులతో పేద రైతుల ఓట్లు కొల్లగొట్టేందుకు వ్యూహం పన్నుతోంది. దీనిలో భాగంగా ఉద్యాన పంటలు వేసేందుకు ఉపాధి నిధులు మంజూరు చేస్తామని చెప్తోంది. ఈ విషయంలో గత ప్రభుత్వంలో టీడీపీ నేతలకు వీరవిధేయుడిగా ఉండి, ఈ సర్కార్‌ వచ్చిన తర్వాత ఓ మంత్రికి భక్తుడి తరహాలో వ్యవహరిస్తున్న ఓ అధికారి పాత్ర కీలకంగా ఉందని చెప్తున్నారు. రైతులకు ఉద్యాన పంటలు వేసుకునేందుకు ఉపాధి నిధులిస్తామని, దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల వేళ అధికారులు పిలుపునిస్తున్నారు. ఉపాధి పథకంలో మంజూరు చేసిన పనులకు ఎన్నికల కోడ్‌ అడ్డురాదన్న ధీమాతో ఈ ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపు లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేసుకునేందుకు అనుమతులు మంజూరుచేసి రైతులకు మంజూరు పత్రాలు ఇవ్వాలని యోచిస్తున్నారు. వైసీపీ పెద్దల కళ్లల్లో ఆనందం చూసేందుకు ఆ అధికారి ఈ ఏర్పాట్లు చేస్తున్నారని పలువురు చెబుతున్నారు.

టీడీపీ ప్రభుత్వంలో విస్తృత ప్రయోజనాలు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉపాధి నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద అగ్రవర్ణ రైతులకు విస్తృత ప్రయోజనాలు కల్పించారు. అప్పట్లో ఎకరా భూమి కలిగిన రైతులు సైతం ఉపాధి పథకం ద్వారా ఉద్యాన పంటలు వేసుకుని బాగా ప్రయోజనం పొందారు. ఒక్కో ఎకరంలో ఉద్యాన పంట వేసుకునేందుకు ఒక్కో రైతుకు రూ.2.50 లక్షల నుంచి రూ.3.50 లక్షల దాకా దక్కాయి. ఉద్యాన పంటలు వేసుకునేందుకు ప్రభుత్వం మొక్కలతోపాటు ఎరువులు, నిర్వహణా వ్యయం ఉపాధి మెటీరియల్‌ నిధులతో సాగేవి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజలకు ఉపాధి పథకం కల్పతరువుగా ఉండేది. అంతేకాకుండా పశువుల మేత పెంచుకునేందుకు ఎకరాకు రూ.30 వేలు ఉపాధి పథకం ద్వారా అందుకున్నారు. దీంతోపాటు సైలేజ్‌ పిట్స్‌కు రూ.15 వేలు, నాడెప్‌ ఫిట్‌ నిర్మాణానికి రూ.10 వేలు, వర్మీ కంపోస్ట్‌ పిట్‌కు రూ.21 వేలు, పొలం చుట్టూ ప్లాంటేషన్‌ కోసం రూ.24 వేలు, ఉద్యాన పంటలు వేసుకునేందుకు ఎకరాకు రూ.1.20 లక్షలు, ఆ పొలంలో ఫార్మ్‌పాండ్‌ తవ్వేందుకు రూ.40 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉపాధి నిధుల నుంచి ఖర్చు చేశారు. భూమి అభివృద్ధి చేసేందుకు రూ.5 లక్షల వరకు ఉపాధి నిధులను వినియోగించుకోవచ్చు. ఫిష్‌ సీడింగ్‌ పాండ్స్‌ను తవ్వుకునేందుకు రూ.5.60 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. బోరుబావుల రీచార్జ్‌కు రూ.18 వేలు, పొలంలో బావి తవ్వుకునేందుకు కూడా నిధులు అందించారు. పశువుల షెడ్‌ నిర్మాణానికి మినీ గోకులం పథకం ద్వారా లక్ష నుంచి రూ.1.80 లక్షల దాకా ఇచ్చారు. మేకలు, గొర్రెల షెడ్లకు ఈ నిధులు వాడుకోవచ్చు. పొలంలో సెరీ కల్చర్‌ ప్లాంటేషన్‌ వేస్తే దాని కోసం రూ.1.64 లక్షలు వ్యయం చేశారు. దీంతోపాటు ఆ కుటుంబానికి లైఫ్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ కోసం రూ.26 వేల వరకు ఖర్చు చేశారు. ఇళ్ల నిర్మాణంలో రూ.18 వేల వరకు ఉపాధి పథకం ద్వారా పొందే అవకాశం ఉంది. ఆ ఇంట్లో సోక్‌పిట్‌ నిర్మాణం కోసం రూ.4700, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.15 వేలు, పెరటి మొక్కల పెంపకానికి కూడా ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. ఇలా ఇతర వ్యవసాయ పథకాలతో సంబంధం లేకుండా ఉపాధి నిధులతోనే ఓ పేద కుటుంబం రూ.లక్షల మేర ఆస్తులు సమకూర్చుకున్నారని, ఇప్పుడదంతా చరిత్ర అయిందని అధికారులు అంటున్నారు.

ఐదేళ్లుగా ప్రభుత్వానికి పట్టని పేద రైతులు

టీడీపీ హయాంలో ఉపాధి హామీ పథకం ద్వారా పేద రైతులు పలు రకాలుగా లబ్ధి పొందారు. కూలీలకు పనులు కల్పించడంతోపాటు ఈ పథకంలో పేద రైతుల పొలాలను సస్యశ్యామలం చేసేందుకు పలు పథకాలు అమలు చేశారు. ఎన్టీఆర్‌ జలసిరి ద్వారా పేదరైతుల పొలాల్లో సోలార్‌ పంపుసెట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఒక్కో రైతుకు రూ.5 లక్షల దాకా లబ్ధి కల్పించారు. ఈ సర్కార్‌ వచ్చిన తర్వాత బోర్లు వేస్తామని చెప్పి వైఎ్‌సఆర్‌ జలకళతో జనాలను మభ్యపెట్టింది. ఉన్న పథకాన్ని మూసేసింది. ఉపాధి హామీ పథకానికి పేద రైతులను దూరం చేసింది. రైతులు ఉపాధి పథకం ద్వారా ఉద్యాన పంటలు వేసుకుంటామని గత ఐదేళ్లుగా మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఏడాదికి ఒక్కో గ్రామానికి 10 ఎకరాల్లోపు సీలింగ్‌ పెట్టి మంజూరు చేశారు. దీంతో రైతులు విసిగిపోయి అధికారులను అడగడం మానేశారు. ఉపాధి పథకంలో ఏటా మెటీరియల్‌ నిధులను గ్రామ, వార్డు సచివాలయాల భవనాలతోపాటు జగనన్న కాలనీల చదును కోసం వాడారు. వాస్తవానికి ఈ పనులు ఉపాధి హామీ పథకం జాబితాలో లేకపోయినప్పటికీ కార్యకర్తలకు పనులు కల్పించి ఆదాయం పొందేందుకు నిధులను విచ్చలవిడిగా వాడేశారు.

ఎన్నికల ముందు గుర్తొచ్చిన రైతులు

వైసీపీ సర్కార్‌కు ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద రైతులు గుర్తొచ్చారు. సీజన్‌ కాకపోయినప్పటికీ ఉపాధి పథకం ద్వారా పేద రైతుల పొలాల్లో ఉద్యాన పంటలు వేసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉపాధి హామీ పథకం ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. వైసీపీ సర్కార్‌కు వీరవిధేయుడిగా ఉన్న ఉపాధి హామీ పథకం ఉన్నతాధికారి ఆ పార్టీ పెద్దల ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. ఎన్నికల వేళ అవసరం లేని ఉద్యాన పంటల ప్రస్తావన తీసుకొచ్చి పేద రైతుల పొలాల్లో ఉద్యాన పంటలు వేసుకునేందుకు ఉపాధి నిధులు ఇస్తామంటూ ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేస్తామని రైతులకు ఆశ చూపించి ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వైసీపీకి మేలు చేసేందుకు ఓ ఉన్నతాధికారి ప్రయత్నాలు ప్రారంభించారని చెప్తున్నారు. టీడీపీ హయాంలో కీలకంగా ఉన్న ఈ అధికారి వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్య పోస్టులు పొందారు. రిటైర్‌ అయి మూడేళ్లయినా కీలక పోస్టులోనే కొనసాగుతున్న ఈ అధికారి.. ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం ఉద్యాన పంటలు వేసుకునేందుకు రైతులకు ఉపాధి నిధులు మంజూరు చేస్తామని చెబుతూ.. పేద రైతుల ఓట్లకు గేలం వేస్తున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 03:28 AM

Advertising
Advertising