TDP Subscriptions : ముమ్మరంగా సభ్యత్వాల నమోదు
ABN, Publish Date - Nov 17 , 2024 | 10:51 PM
నియోజ కవర్గంలో 50 వేల పైచిలుకు సభ్యత్వాలు పూ ర్తి చేసుకుని లక్ష సభ్యత్వాల వైపున కు వడివడిగా అడుగులు పడుతు న్నాయని రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం హర్షం వ్యక్తం చేశారు.
50 వేల సభ్యత్వాలు అధిగమించిన వైనం
లక్ష వైపుగా వడివడిగా నడక
టీడీపీ ఇన్‌చార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం
రాజంపేట, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): నియోజ కవర్గంలో 50 వేల పైచిలుకు సభ్యత్వాలు పూ ర్తి చేసుకుని లక్ష సభ్యత్వాల వైపున కు వడివడిగా అడుగులు పడుతు న్నాయని రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం రాజంపే టలో టీడీపీ సభ్యత్వాల నమోదుపై ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని అనివార్య కారణాల తో పార్టీ ఓటమి చెందినా సభ్యత్వాల విషయంలో అనతికాలంలోనే రికార్డు స్థాయిలో 50 వేల పైచిలుకు సభ్యత్వాలు పూర్తి చేసిందని వివ రించారు. ఏప్రిల్ వరకు టీడీపీ సభ్యత్వాలు చేసు కునే వెసులుబాటున్నా 15 రోజుల్లోనే 50 వేల సభ్యత్వాలు దాటిందన్నారు. నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తల కృషి, వారి తోడ్పాటుతో ఈ లక్ష్యాన్ని సాధించగ లిగానన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా తనకు 60 వేల సభ్యత్వాలు టార్గెట్ ఇచ్చినా లక్ష్యాన్ని వెను వెంటనే సాధించామన్నారు.
టీడీపీతోనే రాష్ట్రం అభివృద్ధి
సిద్దవటం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): మండ లంలో పార్టీ సభ్యత్వ నమోదు విజయవంతంగా జరుగుతోందని రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీనివాసులు నాయుడు తెలియజేశారు. సభ్యత్వ నమోదులో భాగంగా ఆదివారం బెటాలి యన్ వద్ద ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు ఆధ్వ ర్యంలో మండల పరిధిలో పలు గ్రామాల్లో విజయవంతంగా జరుగుతోందన్నారు. నియోజక వర్గస్థాయిలో స్వచ్ఛదంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావడం సంతోషకరమన్నారు. సర్పంచ్ తుర్ర ప్రతాప్ నాయుడు, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కృష్ణయాదవ్ పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండ
లక్కిరెడ్డిపల్లె, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): టీడీపీ సభ్యత్వ నమోదు కార్యకర్తలకు అండగా ఉంటుందని మండల నేత, మాజీ ఎంపీటీసీ యనమల మదన్ మోహన్ పేర్కొన్నారు. ఆదివారం పార్టీ కార్యాల యంలో సభ్యత్వ నమోదుపై ఆయన మాట్లాడు తూ గ్రామ నేతల సహకారంతో సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికీ 7వేలపైచిలు కు పార్టీ సభ్యత్వాలు నమోదు చేశామన్నారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు డాక్టర్ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షఫీనాయక్, హే మంత్ ముక్తార్‌అహ్మద్, మల్లికార్జున, సుధీర్, జనార్ధన్ రెడ్డి, మూగి వెంకటరమణ పాల్గొన్నారు.
సూర్యనారాయణపురంలో...
రామాపురం, నవంబరు17(ఆంధ్రజ్యోతి): కసిరెడ్డి గారిపల్లెలో ఆదివారం టీడీపీ నేతల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నందలూరులో...
నందలూరు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): సభ్య త్వంతో టీడీపీ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఒక భరోసా అని టీడీపీ మండల క్లస్టర్ ఇన్‌చార్జి పసుపులేటి ప్రవీణ్‌కుమార్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ అన్నారు. నాగిరెడ్డిపల్లెలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు సూచనపై సభ్యత్వ నమోదు చేస్తున్నామన్నారు. ‘పార్టీలో చేరుదాం రాష్ట్ర భవిష్యత్‌ను మారుద్దాం’ నినాదంతో ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు.
Updated Date - Nov 17 , 2024 | 10:51 PM