ఏరువాక పౌర్ణమిని అధికారికంగా నిర్వహించాలి
ABN, Publish Date - Jun 22 , 2024 | 12:54 AM
జిల్లా వ్యాప్తంగా ఏరువాక పున్నమి వేడుకలను రైతులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా ఏరువాక పున్నమి వేడుకలను రైతులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎద్దులకు స్నానాలు చేయించి రంగులు వేసి, ప్రత్యేక అలంకారం చేశారు. సాయంత్రం వేళ ఆయా గ్రామాల మైదానాల్లో రైతులకు సంబంధించిన ఎద్దుల పారువేట పోటీలు నిర్వహించారు. విజేతలైన ఎద్దులను గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు.
ఏరువాక పౌర్ణమిని అధికారికంగా నిర్వహించాలి
పత్తికొండ టౌన్ జూన్ 21: దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు నిర్వహించే ఏరువాక పౌర్ణమి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని కొండగేరి ప్రాంత సమీపాన ఉన్న రైతు రవి పొలంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాడెద్దులతో నాగలిని పట్టి రామచంద్రయ్య పొలాన్ని దున్ని ఏరువాక పౌర్ణమి వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాజాసాహేబ్, రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి, రవికుమార్, సుంకన్న, మల్లికార్జున పాల్గొన్నారు.
ఆస్పరి : మండలంలో ఏరువాక పున్నమిని రైతులు ఘనంగా నిర్వహించారు. కైరుప్పలలో పున్నమి సందర్భంగా ఎద్దుల పారువేట ఉత్సాహంగా నిర్వహించారు. రైతులకు రంగులు వేసి అలంకరించారు. ఆయా గ్రామాల్లో ప్రధాన ఆలయాల్లో పూజలు చేశారు.
పెద్దకడుబూరు : మండల కేంద్రంలో ఏరువాక రైతు మహోత్సవం కార్యక్రమం రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ అధ్యక్షతన అరకు దున్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ కొత్త ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, సబ్సిడీ కింద రైతులకు ఎద్దుల బండి, నాగలి గుంటక వివిధ ఉపయోగపడే సామాగ్రిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వెల్దుర్తి : అల్లుగుండు గ్రామంలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే.జగన్నాథం పొలం దున్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం రైతులకు మంచి పథకాలు తేవాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కృష్ణ, రాజు, చిన్నమాదులు, చిలిపికృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Updated Date - Jun 22 , 2024 | 12:54 AM