ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కష్టపడ్డాం.. మాకే కావాలి!

ABN, Publish Date - Nov 27 , 2024 | 11:23 PM

ఏలూరు నగరాభివృద్ధి సంస్థ(ఈడా) చైర్మన్‌ పదవి ఎప్పుడు భర్తీ చేయను న్నారు ? మిగతా నామినేట్‌ పదవుల న్నింటి మాదిరిగానే ఈ పదవికి ఎవరో ఒకరిని నామినేట్‌ చేయాల్సి ఉంది.

ఈడా చైర్మన్‌ పదవిపై టీడీపీలో తీవ్ర పోటీ

రేసులో వెంకట సత్య వరప్రసాద్‌, శివప్రసాద్‌, బలరాం

ఎమ్మెల్యే బడేటిపై ఒత్తిడి

ఇక తేల్చాల్సింది అధిష్ఠానమే

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

ఏలూరు నగరాభివృద్ధి సంస్థ(ఈడా) చైర్మన్‌ పదవి ఎప్పుడు భర్తీ చేయను న్నారు ? మిగతా నామినేట్‌ పదవుల న్నింటి మాదిరిగానే ఈ పదవికి ఎవరో ఒకరిని నామినేట్‌ చేయాల్సి ఉంది. కూటమిలో అనేక మంది దీనిపై ఆశలు పెంచుకు న్నారు. ఒకవైపు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవులను వరుసగా భర్తీ చేస్తున్న క్రమంలో ఏలూరునే ఎందుకు మినహాయించారని అందరూ తెగ టెన్షన్‌ పడిపోతున్నారు.

వరుసగా వివిధ నామినేట్‌ పదవులు కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తూ వస్తోంది. ప్రత్యేకించి ఏలూరు జిల్లాలో ఒకరిద్దరు మినహా మరెవరికీ సరైన స్థానం లభించ లేదు. ఏలూరు నగరాభివృద్ధి సంస ్థ(ఈడా) చైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది. ఈ పదవి కోసం కూటమిలో అత్యధికులు ఆశలు పెంచుకున్నారు. ఇంతకుముందు ఈడాకు చైర్మన్‌గా వ్యవహరించిన మధ్యా హ్నపు ఈశ్వరి పదవీ కాలం ముగి యడంతో ఆ స్థానంలో బొద్దాని శ్రీనివాస్‌ ను అప్పట్లో నియమించారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలుకావడంతో రాజకీయ పరిణామాలు మారాయి. అప్పట్లో వైసీపీ లో ఉన్న మధ్యాహ్నపు ఈశ్వరి, ఆమె భర్త బలరాంతో సహా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఎన్నికలకు ముందే ఇదంతా జరి గింది. ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనం తరం వైసీపీ నేతలంతా టీడీపీ వైపు క్యూ కట్టారు. కొన్నాళ్ళపాటు ఈడా చైర్మన్‌గా ఉన్న బొద్దాని శ్రీనివాస్‌ కూడా టీడీపీలో చేరారు. ఈ క్రమంలో ఈడా ఖాళీ అయ్యింది. దీనిని భర్తీ చేసేందుకు ప్రభు త్వం ఇతర నగరాభివృద్ధి సంస్థల మాదిరి గానే కసరత్తుకు దిగింది. అయినా దీనిపై ఆశలు పెంచుకున్న వారి సంఖ్య ఇప్పటికే భారీ సంఖ్యలో ఉంది. ఎందుకంటే ఉమ్మ డి పశ్చిమలో మూడొంతుల మేర విస్తీర్ణం లో ఈడా పరిధి ఉంటుంది. భవనాల నిర్మాణానికి ప్లాన్‌ అనుమతులు ఇవ్వాల న్నా దీనికే సర్వాధికారాలు ఉంటాయి. దీంతో ఎన్నికల ముందు నుంచే టీడీపీలో విస్తృతంగా కష్టపడిన అనేకమంది అధి కార పగ్గాలు చేపట్టిన తర్వాత తమకు ఈడాలో అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి చంటిని డిమాండ్‌ చేస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈడాకు చైర్మన్‌ ఎవరు కాబోతు న్నారనే దానిపైనే తీవ్ర ఒత్తిడి నెలకొంది. కూటమిలో జనసేన పక్షాన సీనియర్‌ నేతగా ఉన్న రెడ్డి అప్పలనాయుడును ఈ మధ్యనే ఏపీఎస్‌ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌గా అదృష్టం వరించింది. ట్రైకార్‌ చైర్మన్‌గా పోలవరానికి చెందిన బొరగం శ్రీనివాస్‌ ఎంపికయ్యారు. మరో ఇద్దరు, ముగ్గురు మాత్రమే వివిధ కార్పొరేషన్‌లలో డైరెక్టర్లుగా జిల్లా నుంచి నామినేటెడ్‌ పద వులు పొందారు. ఈక్రమంలో ఎప్పటికప్పు డు ఆశలు పెంచుకుని పలానా పదవి తమకు దక్కేలా చూడండంటూ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చంటిపై ఒత్తిడి తెస్తున్నారు.

పోటాపోటీ రేస్‌

ఏలూరు నగరాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవికి టీడీపీలో పోటీ అత్యధికంగానే ఉంది. కష్టించిన దానికి తగిన ప్రతిఫలం అందేలా సహకరించాలని పలువురు నాయకులు ఎమ్మెల్యేను కోరుతూనే ఉన్నా రు. ఇంతకుముందు ఈడా చైర్మన్‌గా వ్యవహరించిన మధ్యాహ్నపు ఈశ్వరికి మరోసారి అవకాశం ఇవ్వాలని ఆమె భర్త, టీడీపీ సీనియర్‌ నేత ఎంఆర్డీ బలరాం గట్టి పట్టుపడుతూనే ఉన్నారు. వైసీపీలో తన భార్య ఈశ్వరికి ఈడా చైర్మన్‌గా రెండోసారి అవకాశం ఇవ్వాలని కోరినా అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆళ్ల నాని వ్యతిరేకించారు. దీంతో తీవ్ర అసం తృప్తితోనే ఎంఆర్డీ దంపతులు వైసీపీ నుంచి బయటపడి టీడీపీలో చేరారు. ఈ తరుణంలో తిరిగి ఈసారి కూడా ఈడా చైర్మన్‌ పదవి తమకు దక్కేలా చూడాలని పార్టీ నాయకత్వానికి ఇప్పటికే విన్నవిం చారు. ఇంకోవైపు ఇంతకుముందు బడేటి బుజ్జి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు పూర్తిగా చేదోడు వాదోడుగా ఉన్న చల్లా వెంకట సత్యవరప్రసాద్‌ (కంప్యూటర్‌ ప్రసాద్‌) సైతం ఈ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బడేటి చంటికి పూర్తిగా ఎన్నికల వ్యవహారాల్లో సాయపడ్డారు. ఈ నేపథ్యం లోనే తాను ఈడా చైర్మన్‌ పదవికి అర్హుడి నని, తనకు ఈ అవకాశం ఇస్తే ఆమోద యోగ్యంగా ఉంటుందంటూ ప్రసాద్‌ తన మనసులోని మాటను పలుసార్లు బయట పెట్టారు. ఆయనతోపాటు నగర అధ్యక్షు డు శివప్రసాద్‌ రంగంలో ఉన్నారు. ఆయన కూడా ఇదే పదవిని ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే చంటి ఇప్పటికే ఏలూరువాసు లకే అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠా నాన్ని కోరారు. ఈ మధ్యనే ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పేరు ఈ పదవి కోసం వినిపించింది. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టేందుకు అధిష్ఠానం సుముకంగా ఉన్న తరుణంలో ఈడా చైర్మన్‌ పదవి ఇస్తారా, లేదా ఎమ్మెల్సీ పద వి ఇస్తారా అనేది కూడా తేలబోతుంది.

Updated Date - Nov 27 , 2024 | 11:23 PM