ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అత్తెసరు మార్కులతో పాసైనా.. ఐటీ విభాగానికి జీఎం చేసేశారు!

ABN, Publish Date - Jun 30 , 2024 | 04:26 AM

తిరుమల తిరుపతి దేవస్థానాలను ఐదేళ్లుగా వైసీపీ జాగీరుగా మార్చేశా రు. తాజాగా బయటపడిన టీటీడీ ఐటీ విభాగం జనరల్‌ మేనేజర్‌ నియామక వ్యవహారం ఈ విషయాన్ని తెలియజేస్తోంది.

  1. టీటీడీ పరువు తీస్తున్న నియామకాలు

  2. వైసీపీ మీడియా సెల్‌లో సేవలకు ప్రతిఫలం

(తిరుపతి-ఆంధ్రజ్యోతి)

తిరుమల తిరుపతి దేవస్థానాలను ఐదేళ్లుగా వైసీపీ జాగీరుగా మార్చేశారు. తాజాగా బయటపడిన టీటీడీ ఐటీ విభాగం జనరల్‌ మేనేజర్‌ నియామక వ్యవహారం ఈ విషయాన్ని తెలియజేస్తోంది. వైసీపీ సోషల్‌ మీడియా సెల్‌లో పనిచేసిన సందీప్‌ కోసం నిబంధనలు మార్చేసి, తీర్మానాలు తిరగరాసి జీఎం కుర్చీలో కూర్చోబెట్టిన తీరు నివ్వెరపరుస్తోంది. బీటెక్‌ బొటాబొటీ మార్కులతో పాసైన ఆయనకు టీటీడీలో ప్రతిష్టాత్మకమైన పోస్టునే కట్టబెట్టేశారు. టీటీడీలో సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు అవసరం అంటూ(నంబరు 268)2019 డిసెంబరు 29న బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు.

దీని నిర్వహణ కోసం సైబర్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌ను రెండేళ్ల కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించాలంటూ 2020 ఫిబ్రవరి 29న బోర్డు మరో తీర్మానం(నంబరు 296) చేసింది. అదే ఏడాది మే 28న జరిగిన సమావేశంలో రూ.లక్ష వేతనంతో ఎల్‌ఎం సందీ్‌ప ను ఈ పోస్టులో నియమిస్తూ తీర్మానం(నంబరు 110) ఆమోదించారు. జూన్‌ 8న ఆయన విధుల్లో చేరారు. ఆయన గతంలో వైసీపీ సోషల్‌ మీడియా విభాగంలో సేవలందించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన ఆయన ఎక్స్‌పర్ట్‌గా ఎటువంటి సేవలందించారోగానీ, ఆయన కాంట్రాక్టు ఉద్యోగం 2022 జూన్‌ 7న ముగియాల్సి ఉండగా, ఆ ఏడాది ఏప్రిల్‌ 30న జరిగిన బోర్డు సమావేశంలో మరో మూడేళ్ల పాటు పొడిగిస్తూ తీర్మానం(నంబరు 71) ఆమోదించారు.

ఇక అక్కడి నుంచి నిచ్చెనలు పేర్చి సందీ్‌పను పైపైకి ఎక్కించే పని మొదలు పెట్టారు. సైబర్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌గా ఉన్న సందీ్‌పకు టీటీడీ ఐటీ విభాగంలో చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. సైబర్‌ సెక్యూరిటీ, సోషల్‌ మీడియా మానిటరింగ్‌కు, టీటీడీ డేటా సెంటర్‌, డేటా రికవరీ సెంటర్ల సూపర్‌వైజరీ మెయింటైనెన్స్‌ కోసం, సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్టులు రూపొందించడానికి, టీటీడీలోని అన్ని విభాగాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ఎస్‌ఎ్‌సడీ కౌంటర్లు, అకామిడేషన్‌ అలాట్‌మెంట్‌ సెంటర్స్‌, తిరుమల, తిరుపతి సహా దేశవ్యాప్తంగా ఉన్న ఆపరేటివ్‌ సెంటర్లతో సమన్వయం కోసం ఆయన సేవలు అత్యవసరమని పాలకవర్గం భావించినట్లు బోర్డు తీర్మానంలో పేర్కొన్నారు. ఇంతటితో తృప్తి చెందలేదు. ఐటీ విభాగం మొత్తానికి ఆయనను అధిపతిని చేసేందుకు జీఎం పోస్టును సృష్టిస్తూ తీర్మానం చేశారు.


ఆ వెంటనే 2022 జనవరి 29న ఐటీ విభాగం జీఎం పోస్టు భర్తీకి నోటిఫికేషన్‌(నంబర్‌ 1-2022) జారీ చేశారు. దానికి స్పందనగా 69 దరఖాస్తులు వచ్చాయి. వడపోతలో ఎల్‌ఎం సందీప్‌, ఎం.దివ్యతేజ్‌ మాత్రమే అర్హులుగా తేలారు. దివ్యతేజ్‌ అసలు ఇంటర్వ్యూకే హాజరు కాలేదు. అంతే సందీ్‌పను జీఎం పోస్టుకు ఎంపిక చేశారు. అయితే జీఎం పోస్టు తీర్మానం ప్రభుత్వ ఆమోదం పొందలేదు. దీంతో జీఎం పోస్టు భర్తీ నోటిఫికేషన్‌ చెల్లదని, రద్దు చేస్తున్నామంటూ అదే ఏడాది ఆగస్టు 10న అప్పటి ఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

అయినా బోర్డు పట్టు వదల్లేదు. నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఈవో జారీ చేసిన ఉత్తర్వులను బోర్డు ఆమోదించలేదు సరికదా మునుపటి నోటిఫికేషన్‌ చెల్లుబాటయ్యేలా, సందీ్‌పను జీఎం గా ఎంపిక చేసిన నిర్ణయం చెల్లుబాటయ్యేలా తీర్మానాలు చేసింది. అయినా సందీప్‌ నియామకం సాధ్యం కాకపోవడంతో ఏడాదిన్నర ప్రయత్నాల తర్వా త ప్రభుత్వం కూడా టీటీడీ ఐటీ విభాగంలో జీఎం సహా 34 పోస్టులు క్రియే ట్‌ చేసేందుకు అనుమతిస్తూ 2023 డిసెంబరులో జీవోఎంఎస్‌ నంబరు 319 జారీ చేసింది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవుతుందని తెలిసి మార్చి 15న సందీ్‌పను టీటీడీ ఐటీ విభాగానికి జీఎంగా నియమించేశారు.

పట్టుబట్టి మరీ నియామకం..

టీటీడీలో ఐటీ విభాగం జనరల్‌ మేనేజర్‌ పోస్టుకు ఎంతో క్రేజ్‌, డిమాండ్‌ ఉన్నాయి. అంతటి ఉద్యోగానికి నోటిఫికేషన్‌ వస్తే దేశవ్యాప్తంగా హేమాహేమీల్లాంటి సాఫ్ట్‌వేర్‌, సైబర్‌ టెక్నాలజీ నిపుణులు క్యూకడతారు. అలాంటిది బొటాబొటీ మార్కులతో పాసైన వ్యక్తి కోసం టీటీడీ పాలకమండలి పట్టుబట్టిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సందీప్‌ తమిళనాడు స్టేట్‌ టెక్నికల్‌ బోర్డు నుంచి ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా 52.62 శా తం మార్కులతో పాసయ్యారు. ఇంత తక్కువ మార్కులు సాధించిన ఈయన నియామకంలో జరిగిన పరిణామాలు అనేక సందేహాలను లేవనెత్తుతున్నాయి.

Updated Date - Jun 30 , 2024 | 07:13 AM

Advertising
Advertising