ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇసుకలో జగన్‌ తిన్నదంతా కక్కిస్తాం: టీడీపీ

ABN, Publish Date - May 03 , 2024 | 05:32 AM

‘రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఇసుకలో సీఎం జగన్‌ తిన్నదంతా మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్కిస్తాం. అడ్డగోలుగా రేటు పెంచి జనం జేబులు ఖాళీ చేసి రూ.వేల కోట్లు బొక్కారు.

అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఇసుకలో సీఎం జగన్‌ తిన్నదంతా మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్కిస్తాం. అడ్డగోలుగా రేటు పెంచి జనం జేబులు ఖాళీ చేసి రూ.వేల కోట్లు బొక్కారు. దీనిని వదిలిపెట్టేది లేదు’ అని తెలుగుదేశం పార్టీ హెచ్చరించింది.

ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ గురువారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘జాతీయ హరిత ట్రైబ్యునల్‌, కాలుష్య నియంత్రణ మండలి వంటి వాటి అనుమతి తీసుకోకుండా అనధికారికంగా 110 గనులు జగన్‌ హయాంలో తెరిచారు.

ఇవిగాక మరో 500 ఇసుక రేవులు లెక్కలోకి రాకుండా నడిపారు. వీటి ద్వారా రూ.వేల కోట్ల దోపిడీ జరిగింది. టెండర్‌ పొందిన జేపీ వెంచర్స్‌ సమయం అయిపోయినా యథేచ్ఛగా తవ్వుకొంది.

ఇప్పుడు సుప్రీం కోర్టులో ఈ వ్యవహారం అంతా బయటపడింది. అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్న రేవులను మూసివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనుమతులు ఉన్న రేవుల్లో సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పింది.

ఇసుక అక్రమ తవ్వకాల వల్ల అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. జగన్‌ కనీసం రూ.50 వేల కోట్లు సంపాదించారు. అమాయకులు 40 మంది ప్రాణాలు కోల్పోయారు’ అని కొనకళ్ల అన్నారు.

Updated Date - May 03 , 2024 | 05:32 AM

Advertising
Advertising