పీపీపీ రహదారి ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ
ABN, Publish Date - Oct 11 , 2024 | 05:58 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) రహదారుల ప్రాజెక్టులపై అధ్యయనం కోసం నిపుణుల కమిటీ ఏర్పాటైంది.
అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) రహదారుల ప్రాజెక్టులపై అధ్యయనం కోసం నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ చీఫ్ నేతృత్వాన ఐదుగురు సభ్యులతో ఈ కమిటీ ని ఏర్పాటుచేస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రహదారి అభివృద్ధి సంస్థ ఎండీ, చీఫ్ ఇంజనీర్, కమిటీ కన్వీనర్, జాతీయ రహదారులు, సీఆర్‌ఎఫ్ చీఫ్ ఇంజనీర్, ఆర్థిక శాఖ ఉప సలహాదారు సురేంద్ర దట్టీ, ఆర్థికశాఖలో పీపీపీ నిపుణుడు షాలెం రాజు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వచ్చే రెండు నెలల్లో అధ్యయనం పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
Updated Date - Oct 11 , 2024 | 05:58 AM