ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

1బీ లాక్‌పై వివరణ ఇవ్వండి

ABN, Publish Date - Jul 05 , 2024 | 12:09 AM

రీసర్వే జరిగిన గ్రామాల్లో 1-బీ అడంగల్‌ మంజూరుకు లాక్‌ పడిందని, దీంతో రైతులకు బ్యాంక్‌లు రుణాలు ఇవ్వడం లేదని గురువారం ఆధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య స్పందించారు.

రీ సర్వే భూముల కథనంపై స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌

ఆలూరు, జూలై 4: రీసర్వే జరిగిన గ్రామాల్లో 1-బీ అడంగల్‌ మంజూరుకు లాక్‌ పడిందని, దీంతో రైతులకు బ్యాంక్‌లు రుణాలు ఇవ్వడం లేదని గురువారం ఆధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య స్పందించారు. ఆలూరు తహసీల్దార్‌ చంద్రశేఖర్‌కు నేరుగా ఫోన్‌ చేశారు. ఎందుకు 1-బీ రావడం లేదో విచారించి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఆలూరు మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈ సమస్య ఉందా... అని జేసీ అరా తీశారు. దీంతో ఆలూరు తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రజినీకాంత్‌ రెడ్డి, ఆర్‌ఐ బసవన్న గౌడ్‌ గ్రామాల వారీగా వీఆరోవోతో సమీక్షించారు. ప్రభుత్వ అసైండ్‌ భూములకు మాత్రమే అధికంగా ఈ సమస్య ఉందని, సమస్యను పరిష్కారం చేయాలని రైతులు కూడా విన్నవించారని తహసీల్దార్‌ వివరణ ఇచ్చారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.

Updated Date - Jul 05 , 2024 | 12:09 AM

Advertising
Advertising