బే పార్కులో భూకోణం
ABN, Publish Date - Nov 21 , 2024 | 05:22 AM
వైసీపీ నేతలకు ‘విశాఖ’ ఒక బంగారు గని! భూములు దోచుకున్నారు. అస్మదీయులకు కారుచౌకగా కట్టబెట్టారు.
వైసీపీ పెద్దల చేతిలో 300 కోట్ల భూమి!
కేటాయించిన భూమిలో 9 ఎకరాలు ఖాళీ
పాతికేళ్లయినా అభివృద్ధి చేయని వైనం
రుషికొండ బీచ్ పక్కనే మరో 3 ఎకరాలు
ఆక్రమించి కంచె వేసిన వైసీపీ నేతలు
సర్కారు స్వాధీనం చేసుకుంటుందా?
వైసీపీ హయాంలో చేతులు మారిన ప్రాజెక్టు
లీజు గడువు అవ్వకుండానే 99 ఏళ్లకు పెంపు
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)
వైసీపీ నేతలకు ‘విశాఖ’ ఒక బంగారు గని! భూములు దోచుకున్నారు. అస్మదీయులకు కారుచౌకగా కట్టబెట్టారు. సీపీ నేతలకు ‘విశాఖ’ ఒక బంగారు గని! భూములు దోచుకున్నారు. అస్మదీయులకు కారుచౌకగా కట్టబెట్టారు. సీపీ నేతలకు ‘విశాఖ’ ఒక బంగారు గని! భూములు దోచుకున్నారు. అస్మదీయులకు కారుచౌకగా కట్టబెట్టారు. సీపీ నేతలకు ‘విశాఖ’ ఒక బంగారు గని! భూములు దోచుకున్నారు. అస్మదీయులకు కారుచౌకగా కట్టబెట్టారు. పర్యాటక ప్రాజెక్టులను కైవసం చేసుకున్నారు. అలాంటి ప్రాజెక్టుల్లో ఒకటి... ‘బే పార్కు’! ఇందులో మరో భూకోణం బయటికి వచ్చింది. బేపార్కుకు ప్రభుత్వం లీజుకు అప్పగించిన స్థలంలో తొమ్మిదెకరాల భూమి పాతికేళ్లుగా ఖాళీగా ఉంది. ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనుల్లో ఒక్కటీ చేయలేదు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం తక్షణం ఆ భూమిని స్వాధీనం చేసుకోవచ్చు. శారదా పీఠానికి అక్రమంగా, అడ్డగోలుగా చేసిన భూకేటాయింపును రద్దు చేసినట్లే... బేపార్కు భూమినీ స్వాధీనం చేసుకుంటుందా? అని ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇండో అమెరికన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అనే సంస్థ 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పర్యాటక ప్రాజెక్టు చేపడతామని ప్రతిపాదించి రుషికొండలో 37 ఎకరాలు లీజుకు తీసుకుంది. లీజు కాలం 33 ఏళ్లు. ఈ ఒప్పందం 2000లో జరిగింది. ఈ భూమిలో కొండపైన 28 ఎకరాలు, కొండకు ఎదురుగా రుషికొండ బీచ్‌ను ఆనుకొని 9ఎకరాల భూమి ఉంది. ఇదంతా సీఆర్‌జెడ్ పరిధిలో ఉండడంతో నిర్మాణాలకు అనుమతులు తెచ్చుకోవడంలో ఆలస్యమైంది.
కొండపై ప్రాజెక్టుకు ‘బే పార్కు’ అని నామకరణం చేశారు. వైసీపీ అధికారంలోకొచ్చాక ఆ పార్టీ పెద్దలు విశాఖలో విలువైన భూములు, ప్రాజెక్టులు హస్తగతం చేసుకున్నారు. అందులో బే పార్క్ కూడా ఒకటి. ‘ఇస్తారా చస్తారా’ అంటూ బెదిరించారు. బ్యాంకు రుణాలు తాము చూసుకుంటామని చెప్పి వారి నుంచి లాగేసుకున్నారు. అయితే, బీచ్‌కు ఆనుకుని ఉన్న తొమ్మిదెకరాల భూమి మాత్రం 25 ఏళ్ల నుంచి అలాగే ఉంది. దాని పక్కనే మరో 3ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కలిపేసుకొని చుట్టూ కంచె వేశారు. రుషికొండలో ప్యాలెస్ నిర్మించినప్పుడు, వర్కర్లు తాత్కాలికంగా నివాసం ఉండడానికి ఈ భూముల్లో షెడ్లు వేశారు. వాటిని తొలగించలేదు. రుషికొండలో ఇప్పుడు ఎకరా విలువ రూ.25 కోట్లు. 9ఎకరాల లీజు భూమి విలువ రూ.225 కోట్లు, ఆక్రమణలో ఉన్న భూమి విలువ రూ.75 కోట్లు. మొత్తం 300 కోట్ల విలువైన భూమి వైసీపీ నేతల ‘కబ్జా’లోనే ఉంది.
ఏడాది క్రితమే లీజు పెంపు
బే పార్క్ లీజు గడువు 2032 చివర్లో ముగుస్తుంది. అయితే వైసీపీ పెద్దలు ఈ లీజును 99 ఏళ్లకు పెంచుతూ 2023లో రిజిస్ట్రేషన్ పనులు పూర్తిచేశారు. కొండపైన బే పార్క్ సంగతి పక్కన పెట్టినా, కింద 9ఎకరాల కేటాయింపును రద్దు చేయవచ్చు. ఆక్రమించిన మూడు ఎకరాలనూ స్వాధీనం చేసుకోవచ్చు. సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విశాఖ వాసులు కోరుతున్నారు.
Updated Date - Nov 21 , 2024 | 05:22 AM