పడి లేచిన ఉల్లి
ABN, Publish Date - Dec 14 , 2024 | 11:58 PM
ఒక్క సారిగా ఉల్లి నారు ధర ఆకాశాన్ని అంటింది. గత నెల రోజుల క్రితం ఉల్లికి ధర తగ్గడంతో నిన్న మొన్నటి వరకు ఉల్లి నారు వైపు కన్నెత్తి చూడని రైతులు మార్కెట్‌లో ఉల్లి ధర పెరుగుతుందటంతో పంట సాగు చేసేందుకు అధిక ఆసక్తి చూపుతున్నారు.
ఒక్కసారిగా పెరిగిన ఉల్లినారు ధర
ఒక బెడ్(మడి) ధర రూ. 500 నుంచి రూ. 3000
గోనెగండ్ల, డసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఒక్క సారిగా ఉల్లి నారు ధర ఆకాశాన్ని అంటింది. గత నెల రోజుల క్రితం ఉల్లికి ధర తగ్గడంతో నిన్న మొన్నటి వరకు ఉల్లి నారు వైపు కన్నెత్తి చూడని రైతులు మార్కెట్‌లో ఉల్లి ధర పెరుగుతుందటంతో పంట సాగు చేసేందుకు అధిక ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం రైతులకు ఉల్లినారు చిక్కడం కష్టతరంగా మారింది. గత నెల రోజుల క్రితం ఉల్లి మడి ధర రూ. 500 పలికింది. నేడు మడి రూ. 2500నుంచి రూ. 3000 వరకు ధర పలుకుంది. ఉల్లికి ధర పెరగడంతో ్లనారు సాగు చేసిన రైతులు అమాంతంగా రేటు పెంచేశారు. ఉల్లి విత్తనాల ఽరేటు కూడా కిలో రూ. 150 నుంచి రూ. 600 వరకు పెరిగింది. ఒక ఎకరానికి 200 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. అయితే గత కొన్ని రోజులుగా ఉల్లి కి ధర లేక పోవడంతో ఉల్లి నారు సాగు కు రైతులు మక్కువ చూపలేదు. ఇప్పటికి మండలంలో ఉల్లి నారు సాగు చేసిన పొలాలో ఉల్లి నారు అయిపోయింది. ధర పెరగడంతో మళ్లి ఉల్లినారును సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
Updated Date - Dec 14 , 2024 | 11:59 PM