మత్స్యకారుల వాగ్వాదం
ABN, Publish Date - Sep 11 , 2024 | 11:45 PM
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద బుధవారం చేపలవేట వాగ్వాదానికి దారితీసింది.
జూపాడుబంగ్లా, సెప్టెంబరు 11: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద బుధవారం చేపలవేట వాగ్వాదానికి దారితీసింది. మత్స్యకారులు ఘర్షణకు పాల్పడడంతో పంచాయితీ పోలీసు స్టేషనకు చేరింది. మత్స్యశాఖ అధికారులు పోతిరెడ్డిపాడు వద్ద 100 మీటర్ల వరకు చేపలు పట్టకూడదని నిషేధించారు. వారిమాటలు, పోలీసుల ఆదేశాలు లెక్కచేయకుండా ప్రమాదకర స్థలంలో చేపలు పడుతున్నారు. బుధవారం మత్స్యకారులు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగారు. ఎస్‌ఐ లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు మత్స్యకారులను పోలీసు స్టేషనకు తీసుకొచ్చారు. ఆ ప్రాంతంలో చేపలు పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాబోలు, పోతులపాడు, తుమ్మలూరు గ్రామాలకు చెందిన వందలాది మత్స్యకారులు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ డేంజర్‌జోన వద్ద నెలలో గ్రామాల వారిగా వంతుల ప్రకారం గుత్తి వలలు, జాలీలతో ప్రమాదకరంగా చేపలు పట్టుకుంటున్నారు. మంగళవారం చాబోలు గ్రామానికి చెందిన వంతులు ముగియడం, తుమ్మలూరు గ్రామానికి చెందిన మత్స్యకారులు ప్రారంభించిన కొద్దీ సేపటికి వారిలో వారికే పడకపోవడంతో ఈ వివాదం నెలకొంది. మత్స్యకారుల మధ్య వాగ్వాదానికి చేపల వ్యాపారులే కారణమని పలువురు చర్చించుకుంటున్నారు.
Updated Date - Sep 11 , 2024 | 11:45 PM