ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రగతి కోసం..

ABN, Publish Date - Nov 11 , 2024 | 12:10 AM

ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఎన్నికైన 14 మంది ఎమ్మెల్యేలు జూన 21న జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రమాణస్వీకారం చేశారు.

అసంపూర్తిగా సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రీకరించాలి

విశ్వవిద్యాయ భవన నిర్మాణాలేమయ్యాయి?

వలసలతో దెబ్బతింటున్న పల్లె జీవితాలు

రహదారుల మరమ్మతులు సరే.. శాశ్వత పరిష్కారం ఏదీ..?

టిడ్కో ఇళ్లు పేదలకు పంపిణీ చేయాలి

నేటి నుంచి 11 రోజులు అసెంబ్లీ సమావేశాలు

అమరావతికి బయలుదేరిన టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు

కర్నూలు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఎన్నికైన 14 మంది ఎమ్మెల్యేలు జూన 21న జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రమాణస్వీకారం చేశారు. వారిలో 12 మంది టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు. నేటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో పాల్గొనేందుకు ఆదివారం అమరావతి చేరుకున్నారు. కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఆదోని, డోన, నందికొట్కూరు, ఆలూరు ఎమ్మెల్యేలు మంత్రి టీజీ భరత, కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, డాక్టర్‌ పార్థసారథి, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, గిత్తా జయసూర్య, బి.విరుపాక్షి ఈ ఏడుగురు తొలిసారి ఎన్నికైన వారే. బనగానపల్లె, ఎమ్మిగనూరు, శ్రీశైలం, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు మంత్రి బీసీ జనార్దనరెడ్డి, బీజీ జయనాగేశ్వరరెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, భూమా అఖిలప్రియ రెండో పర్యాయం గెలిచారు. నంద్యాల ఎమ్మెల్యే మంత్రి ఎనఎండీ ఫరూక్‌ నాలుగుసార్లు గెలిస్తే.. పాణ్యం, మంత్రాలయం ఎమ్మెల్యేలు గౌరు చరిత, వై. బాలనాగిరెడ్డి మూడు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం కొలుదీరాక రెండో అసెంబ్లీ సమావేశాలు ఇవి. పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. సీనియర్‌ ఎమ్మెల్యేలు జూనియర్‌ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి జిల్లా సమస్యలు, ప్రాజెక్టులపై అసెంబ్లీలో గళమెత్తి అత్యధిక నిధులు రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఫ సాగునీటి ప్రాజెక్టులపై పట్టుబట్టాలి:

జిల్లాలో కరువు శాశ్వత నివారణ జరగాలంటే తుంగభద్ర, కృష్ణా నదుల వరద జలాలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే మెట్ట పొలాలు సస్యశ్యామలమవుతాయి. కరువు.. వలసల నివారణ సాధ్యం అవుతుంది. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో కరువు, వలసలు నివారణే లక్ష్యంగా 40 వేల ఎకరాలకు సాగు, 1.20 లక్షల జనాభాకు తాగునీరు అందించాలని రూ.1,985.42 కోట్లతో చేపట్టిన ఆర్డీఎస్‌ కుడి కాలువ, ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 1.50 లక్షల జనాభాకు సాగునీటి అందించాలని రూ.1,94.80 కోట్లతో చేపట్టి వేదవతి ఎత్తిపోతల పథకం అసంపూర్తి పనులు చేపట్టాలి. హంద్రీనీవా పత్తికొండ జలాశయం కుడి ఎడమ కాలువలు కింద 61 వేల ఎకరాలు సాగునీరు అందాలంటే రూ.200 కోట్లు తక్షణమే ఇవ్వాలి. సుంకేసులు బ్యారేజీ ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంలో గుండ్రేవుల జలాశయం నిర్మాణానికి రూ.2,980 కోట్లు గత టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు వెంటనే చేపట్టాలి. వీటితో పాటు అలగనూరు జలాశయం, గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాలు మరమ్మతులు నిధులు రాబట్టేలా అసెంబ్లీలో గళం వినిపించాలి.

ఫ టిడ్కో ఇళ్లు పేదలకు పంపిణీ చేయాలి:

గత టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏపీ టిడ్కో ఇళ్లు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో కర్నూలు నగరంలో 9185 ఇళ్లు, ఆదోని పట్టణంలో 3,800, ఎమ్మిగనూరు పట్టణంలో 3,250, నంద్యాల 5,075 కలిపి 21,300 ఇళ్లు పేదలకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం రంగులు వేసి వదిలేసింది. రూ.కోట్లు ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉంది. నిర్మాణాలు పూర్తయిన 21,300 ఇళ్లు పేదలకు పంపిణీ చేయడంతో పాటు అసంపూర్తి ఇళ్లు ఏడాదిలోగా పూర్తి చేయాలి. గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన జగనన్న కాలనీల్లో లక్షల ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసేలా అసెంబ్లీ వేదికగా గళం వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇవి కూడా:

ఫ పత్తికొండ ప్రాంత రైతుల చిరకాల స్వప్నం టమోటా జూస్‌ పరిశ్రమ. 3 వేల హెక్టార్లలో టమోటా సాగు అవుతుంది. టమోటా జూస్‌ ఫ్యాక్టరీ, టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌, ఉల్లి ప్రాసెసెంగ్‌ యూనిట్‌, శీతల గిడ్డంగులపై గళం వినిపించాలి.

ఫ కర్నూలు సర్వజన వైద్యశాల, మెడికల్‌ కాలేజీ భనవాలు, ఆదోని మెడికల్‌ కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణాలు రూ.930 కోట్లతో చేపట్టారు. వివిధ దశల్లో పనులు ఆపేశారు. ఈ పనులు మొదలు పెట్టి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలి.

ఫ రాయలసీమ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల 192 ఎకరాల్లో జగన్నాథగట్టుపై రూ.20 కోట్ల రూసా నిధులతో చేపట్టారు. అయితే పనులు పునాదులతో ఆగిపోయాయి. ఓర్వకల్లు విమానాశ్రయం పక్కనే 144.92 ఎకరాల విస్తీర్ణం, ఫేజ్‌-1 కింద రూ.18 కోట్లతో గత టీడీపీ ప్రభుత్వంలో డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ విశ్వావిద్యాలయ భవన నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. ఈ పనులు మొదలు పెట్టాలి.

ఫ జగన్నాథగట్టుపై 52 ఎకరాల్లో రూ.80 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ‘క్లస్టర్‌ యూనివర్సిటీ’ పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. ఈ పనులు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి.

ఫ ఉమ్మడి జిల్లాలో ఆర్‌ అండ్‌ బీ రోడ్లు, జల్‌ జీవన మిషన నిధులతో చేపట్టిన ఇంటింటికి కుళాయి పనులు మళ్లీ మొదలు పెట్టి పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు రాబట్టాలి.

ఫ ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎమ్మిగనూరులో మెగా టెక్స్‌టైల్‌ పార్కు, ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత పక్కా భవనాల నిర్మాణం, కోడుమూరు పట్టణం తాగునీటి సమస్య పరిష్కారానికి గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపులైనపై గట్టిగా పట్టుబట్టి నిధులు, అనుమతులు రాబట్టేందుకు అసెంబ్లీ వేదికగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Nov 11 , 2024 | 12:10 AM