ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కొల్లేటి కోట ఎవరిదో !

ABN, Publish Date - May 02 , 2024 | 04:20 AM

బుర్రమీసాల(కనుమూరి) బాపిరాజు నాలుగు సార్లు, రైతు పక్షపాతి(ఎర్నేని) రాజారామచందర్‌ రెండు సార్లు ప్రా తినిధ్యం వహించిన కైకలూరు నియోజకవర్గంలో ఈ దఫా కీలక పోరు నెలకొంది.

కామినేని X దూలం

కైకలూరులో ఢీ అంటే ఢీ

కాంటూరు కుదింపు, ఆక్వా సమస్యలే కీలకం

ఐదేళ్లుగా జాడలేని అభివృద్ధి

దాడులు, అక్రమ కేసులు, అరెస్టులతో విసుగెత్తిన జనం

సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కామినేని క్రియాశీలం

ఎమ్మెల్యే దూలం తీరుపై జనంలో వ్యతిరేకత

బుర్రమీసాల(కనుమూరి) బాపిరాజు నాలుగు సార్లు, రైతు పక్షపాతి(ఎర్నేని) రాజారామచందర్‌ రెండు సార్లు ప్రా తినిధ్యం వహించిన కైకలూరు నియోజకవర్గంలో ఈ దఫా కీలక పోరు నెలకొంది. బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు

టీడీపీ-జనసేన మద్దతుతో బరిలో నిలువగా.. ప్రస్తుత ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.

ఒకప్పుడు కృష్ణా జిల్లాలో భాగమైన ఈ సీటు.. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లాలో చేరింది. మూడొంతులు ప్రఖ్యాత కొల్లేరు సరస్సుతో ముడిపడి ఉంది.

ఆక్వా రంగానికి ఆలవా లం కూడా. కొల్లేరు కాంటూరు కుదింపు, నీటి శుద్ధి, చేపల చెరువులు, ఆక్వాకు చేయూత, తాగునీరు, రోడ్లు, డ్రైయునేజీ ఏనాటి నుంచో ఇక్కడ ప్రధాన సమస్యలు. అయితే గత ఐదేళ్లలో వైసీపీ దౌర్జన్యాలు, దాడులు, తప్పుడు కేసులతో జనం విలవిలలాడారు. కైకలూరులో వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు తొలిసారి 2019లో గెలిచారు.

తన సమీప టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణపై 9,357 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ జనసేన తరఫున పోటీ చేసిన బి.వెంకటేశ్వరరావుకు అప్పట్లో 10 వేలకు పైగా ఓట్లు దక్కాయి. 2014లో ఇక్కడ బీజేపీ-టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీచేసిన కామినేని శ్రీనివాస్‌ విజయం సాధించి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి కూడా అయ్యారు. 2019లో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత నియోజకవర్గంలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి.

అందులో ముఖ్యమైనది జయమంగళ వైసీపీలో చేరిపోవడం. ఇక కొల్లే రు కాంటూరు విషయంలో తగు నిర్ణయం తీసుకుంటామని జగన్‌ ఇచ్చిన హామీ నెరవేరలేదు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు మిగతా నేతలు ఈ దిశగా పట్టుపట్టనూ లేదు.

పైగా నిరు డు నిబంధనలకు విరుద్ధంగా కొల్లేరులో అక్రమంగా చేపల చెరువుల తవ్వకానికి స్వయంగా ఎమ్మెల్యేనే నడుం బిగించ డం విమర్శలకు దారితీసింది. అభివృద్ధి కుంటుబడింది.

రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణమూ జరుగలేదు. అన్నిటికీ మిం చి తన పర భేదం లేకుండా వైసీపీ నేతలు ఎడాపెడా తప్పు డు కేసులు మోపి జనాలను తీవ్రంగా వేధించారు.

మహిళలను కూడా జైలు పాల్జేయడం వంటి పరిణామాలు అధికార పక్షానికి ఇబ్బందికరంగా పరిణమించాయి. కొల్లేరు కాంటూరు కుదింపు వ్యవహారం 2014 మధ్య టీడీపీ హ యాంలో ఒక నినాదంగా సాగింది. సరస్సును 5వ కాంటూ రు నుంచి మూడో కాంటూరుకు కుదిస్తే ఏకం గా 30 వేల ఎకరాలు మిగులు భూములపై స్పష్టత రావడమే కాకుండా ఇవన్నీ పేదప్రజలకు పంచడానికి దోహదపడుతుంది.


  • ఆక్వా ఆగమాగం..

ఆక్వా రంగం ఎక్కువగా విస్తరించిన కైకలూరు నియోజకవర్గంలో ఈ రంగానికి వైసీపీ ప్రభుత్వం ఎటువం టి మేలు చేయకపోగా నష్టం చేకూర్చిందని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీ హయాంలో ఆక్వాకు కరెంటు యూనిట్‌ రూ.1.50కి ఇచ్చేవారు. జగన్‌ వచ్చాక ఆక్వా, నాన్‌ ఆక్వా జోన్లు అంటూ విభజించి ఈ రంగాన్ని కకావికలం చేశారు. యూనిట్‌ విద్యుత్‌ ధరను రూ.3.85కి పెంచారు. 2019కి ముందు కరెంటు బిల్లు రూ.30 వేలు వచ్చేది. అది 1.25 లక్షలు దాటిపోవడం రైతుకు భారంగా పరిణమించిం ది. కొల్లేరు సరస్సులోకి సముద్రపు ఉప్పునీరు చొరబడకుండా రెగ్యులేటర్‌ నిర్మాణానికి జగన్‌ ప్రభుత్వం జీవో జారీచేసి.. గాలికి వదిలేసింది.

ఏలూరు, ఆంధ్రజ్యోతి

  1. కైకలూరు నియోజకవర్గ స్వరూపం..

( కైకలూరు, ముదినేపల్లి, కలిదిండి,

మండవల్లి మండలాలు ఉన్నాయి)

మొత్తం ఓటర్లు 2,05,604

పురుషులు: 1,01,196, మహిళలు: 1,04,404,

ట్రాన్స్‌జెండర్లు: 4

కీలక సామాజికవర్గాల ఓటర్లు..(సుమారుగా)

మాలలు-39 వేలు, కాపులు-31 వేలు, యాదవ-24 వేలు, గౌడ-17 వేలు, వడ్డి-13 వేలు, అగ్నికుల క్షత్రియ-8 వేలు, వెలమ-8వేలు, తూర్పు కాపు-7 వేలు, ముదిరాజ్‌లు-7 వేలు, కమ్మ-6 వేలు

కామినేని శ్రీనివాసరావు

నియోజకవర్గంలో అన్ని వర్గాలతో సాన్నిహిత్యం.. కేసులు, కొట్లాటలు, అనవసర జోక్యానికి దూరం.. 2014-19 నడుమ మంత్రిగా ఉండి దాదాపు 790 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు, కొల్లేరు వ్యవహారాల్లో ప్రజలపక్షానే నిలబడడం.. కరోనా సమయంలో వైద్య సేవలు.

నియోజకవర్గ ప్రజలకు పూర్తి సమయం కేటాయించకపోవడం.. ఎక్కువ హైదరాబాద్‌లోనే గడపడం. గట్టిగా ఆరు నెలల ముందు నుంచే క్రియాశీలం.

దూలం నాగేశ్వరరావు

ఆర్థికంగా బలంగా ఉండడం.. వైసీపీ శ్రేణులపై పట్టు.

కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువగా ఉండడం.. కొల్లేరులో అక్రమ చేపల చెరువులను ప్రోత్సహించడం.. జగనన్న కాలనీ పరిసరాల్లో ఆస్తులు కూడగట్టుకోవడం.. తాను చెప్పిందే చెల్లాలనే ధోరణి.. తప్పుడు కేసులు బనాయించడం.. స్వపక్షీయులపైనా అక్రమ కేసులు.

Updated Date - May 02 , 2024 | 04:20 AM

Advertising
Advertising