ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈసారికి అసెంబ్లీ గడప తొక్కను!

ABN, Publish Date - Jul 26 , 2024 | 02:46 AM

అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నాటితో ముగుస్తుండటంతో మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చివరి రోజైనా సభకు హాజరవుతారని అందరూ భావించారు. అయితే ఈసారికి అసెంబ్లీకి వెళ్లనని, వచ్చే

సన్నిహితులకు చెప్పిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌

అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నాటితో ముగుస్తుండటంతో మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చివరి రోజైనా సభకు హాజరవుతారని అందరూ భావించారు. అయితే ఈసారికి అసెంబ్లీకి వెళ్లనని, వచ్చే సమావేశాల్లో పాల్గొనడంపై ఆలోచిద్దామని సన్నిహితులతో చెప్పారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అనుకూల మీడియాతో సమావేశమవ్వాలని నిర్ణయించారు. సాయంత్రం లేదా శనివారం ఉదయం బెంగళూరు యెలహంక ప్యాలె్‌సకు వెళతారు. 3రోజులు మకాం వేస్తారు. కాగా, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ బుధవారం ఢిల్లీలో ధర్నా చేసిన జగన్‌ గురువారం తాడేపల్లి తిరిగొచ్చారు. మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో ఉన్నా జగన్‌కు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. బీజేపీ నేతలెవరూ జగన్‌ను కలిసేందుకు ఇష్టపడలేదు. ధర్నా సహా మొత్తంగా ఢిల్లీ పర్యటన అట్టర్‌ఫ్లాప్‌ అవ్వడంతో నిరాశగా తిరిగొచ్చేశారు.

Updated Date - Jul 26 , 2024 | 02:46 AM

Advertising
Advertising
<