ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మచిలీపట్నం మాజీ మున్సిపల్‌ కమిషనర్‌కు జైలు

ABN, Publish Date - Jun 29 , 2024 | 05:15 AM

మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాజీ కమిషనర్‌ జి.చంద్రయ్యకు కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష పడింది. ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2000 జరిమానాకు హైకోర్టు విధించింది.

కోర్టు ధిక్కరణ కేసులో 6 నెలలు జైలు, 2 వేలు జరిమానా

అప్పీల్‌ దాఖలుకు తీర్పు అమలు 4 వారాల నిలుపుదల

అమరావతి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాజీ కమిషనర్‌ జి.చంద్రయ్యకు కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష పడింది. ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2000 జరిమానాకు హైకోర్టు విధించింది. అప్పీల్‌ చేసుకొనేందుకు సమయం ఇవ్వాలని చంద్రయ్య తరఫు న్యాయవాది అభ్యర్థించడంతో తీర్పు అమలును నాలుగు వారాలు నిలుపుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ప్రస్తుతం చంద్రయ్య ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఎస్‌.వెంకటేశ్‌ రెవెన్యూ ఆఫీసర్‌గా పనిచేశారు.

వెంకటేశ్‌పై ఏసీబీ అధికారులు క్రిమినల్‌ కేసు పెట్టడంతో అధికారులు ఆయన్ను సస్పెండ్‌ చేశారు. చార్జిషీట్‌ దాఖలు ఆలస్యం కావడంతో తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వెంకటేశ్‌ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దానిని పరిశీలించిన పురపాలక శాఖ డైరెక్టర్‌ వెంకటేశ్‌ను విధుల్లోకి చేర్చుకోవాలని 2022 అక్టోబరు 17న మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ను ఆదేశించారు. పురపాలక శాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులకు కమిషనర్‌ స్పందించకపోవడంతో వెంకటేశ్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం పురపాలక శాఖ డైరెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వులు, పిటిషనర్‌ వినతిని పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని 2023 మే 12న తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు అమలు చేయకపోడంతో పిటిషనర్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి చంద్రయ్య తీరును తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రయ్య వ్యవహారశైలి చట్టబద్ధమైన పాలనకు విఘాతమని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులలో తప్పులు వెతక్కుండా వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే అప్పీల్‌ దాఖలు చేసుకోవాలన్నారు. ప్రస్తుత కేసులో చంద్రయ్య ఉన్నతాధికారుల ఆదేశాల పట్ల అవిధేయత ప్రకటించడమే కాకుండా కోర్టు ఉత్తర్వుల అమలును ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని అభిప్రాయపడ్డారు. ఈ నేపఽథ్యంలో చంద్రయ్యకు జైలు శిక్ష, జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - Jun 29 , 2024 | 05:15 AM

Advertising
Advertising