రేపటి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు
ABN, Publish Date - Oct 31 , 2024 | 05:02 AM
సూపర్-6’ హామీల అమలులో భాగంగా ఏడాది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
తొలిరోజే 4.3 లక్షల బుకింగ్‌లు
రేపు శ్రీకాకుళంలో లాంఛనంగా పంపిణీని
ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
తొలివిడత రాయితీ సొమ్ము పెట్రోలియం
సంస్థలకు అందజేసిన ముఖ్యమంత్రి
అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ‘సూపర్-6’ హామీల అమలులో భాగంగా ఏడాది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ’దీపం-2’ పథకంగా వ్యవహరిస్తున్న ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి తొలి ఏడాది రూ.2,684 కోట్లు మంజూరు చేసింది. ఇందులో తొలివిడతగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి అయ్యే మొత్తం రూ.894 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పెట్రోలియం సంస్థలకు అందజేశారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం చేతుల మీదుగా హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ల ప్రతినిధులు ఆ చెక్కును అందుకున్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహన్, ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబరు 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేసి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక నుంచి ప్రతి రోజూ లక్షల సంఖ్యలోనే ఉచిత సిలిండర్ల కోసం బుకింగ్‌లు కొనసాగనున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందిన 48 గంటల్లోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Updated Date - Oct 31 , 2024 | 05:02 AM