ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సొంతానికి ఉచితంగా ఇసుక

ABN, Publish Date - Oct 17 , 2024 | 05:25 AM

వ్యక్తిగత అవసరాలకు వాగులు, వంకల్లోని ఇసుకను ఉచితంగా తవ్వుకొని తీసుకువెళ్లడానికి అనుమతించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరిగింది.

వాగులు, వంకల్లో ఎవరైనా,

ఎక్కడైనా తవ్వి తరలించుకోవచ్చు

సంక్రాంతి నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి

ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు ఉచితంగా సౌర విద్యుత్‌

రౌడీషీట్ల తరహాలోనే గంజాయి స్మగ్లర్ల షీట్లు

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు

ఇసుక రవాణా వాహనాలను అడ్డుకునే

పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం

రవాణా అధికారులు కూడా ఆపడానికి వీల్లేదు

ప్రజలకు విరివిగా ఇసుక లభ్యం కావాలి

బ్లాక్‌ చేసి అధిక ధరలకు అమ్మితే సహించం

పది రోజుల్లో తేడా కనిపించాలి: చంద్రబాబు

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత అవసరాలకు వాగులు, వంకల్లోని ఇసుకను ఉచితంగా తవ్వుకొని తీసుకువెళ్లడానికి అనుమతించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరిగింది. సీఎం మాట్లాడుతూ, ‘ఇసుకను ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేశాం. రాష్ట్రంలో అనేకచోట్ల వాగులు, వంకలు ఉన్నాయి. వాటిలో ఎక్కడైనా, ఎవరైనా తమ సొంత అవసరాల కోసం ఉచితంగా ఇసుకను తవ్వుకొ ని తీసుకువెళ్లవచ్చు. ఎడ్ల బళ్లు, ట్రాక్టర్లతో రవాణా చేసుకోవ చ్చు. వాటిని ఎవరూ ఆపరు. దానికి ఏ అనుమతి అక్కర్లేదు. ఎవరికీ పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. పెద్ద నదుల విషయంలో మాత్రం నిబంధనలు పాటిస్తాం. లారీలకు టన్నుల పరిమితి లేదు. వాటి సామర్థ్యాన్ని బట్టి అనుమతి ఇస్తాం. ఇకపై ఇసుక తక్కువ ధరకు లభించాలి. పది రోజు ల్లో ఈ తేడా కనిపించాలి. ఎవరైనా ఇసుకను బ్లాక్‌ చేసి అధిక ధరలకు అమ్మితే ఊరుకొనేది లేదు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానం కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు. వాగులు, వంక ల నుంచి ప్రజలు ట్రాక్టర్లలో ఇసుక తీసుకువెళ్తుంటే పోలీసులు ఆపి, జరిమానా విధిస్తున్నారని మంత్రి డీవీబీ స్వామి ఫిర్యాదు చేశారు. నదుల్లో ఇసుక లోడింగ్‌కు కొంతమంది బాగా తక్కువ ధరకు టెండర్లు వేశారన్న ఫిర్యాదులపై కూడా చర్చించారు. ఇలాంటి వారివద్ద డిపాజిట్‌ భారీగా తీసుకోవాలని, చేయలేకపోతే ఆ డిపాజిట్‌ను జప్తు చేయాలని సీఎం సూచించారు. ఏ ఊళ్లో ఇసుకను ఆ ఊరివాళ్లే తీసుకోవాలన్న నిబంధన లేదన్నారు. ఏవైౖనా సమస్యలుంటే మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకోవాలన్నారు.


రాష్ట్రంలో రోడ్ల మరమ్మతు పనులు నవంబరు 1 నుంచి ప్రారంభించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. దీనికోసం మరో రూ.300కోట్లు అదనంగా కేటాయిస్తూ సీఎం నిర్ణయం తీసుకొన్నారు. పల్లె పండుగ తరహాలోనే రోడ్ల మరమ్మతు పనుల ప్రారంభాన్ని కూడా రాష్ట్రమంతా ఒక వేడుకలా నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి గృహాలకు సౌర విద్యుత్‌ పరికరాలను ఉచితంగా బిగించాల ని నిర్ణయించారు. గ్రామాల్లో ఇళ్లకు ఈ పరికరాలు బిగించుకొనేలా ప్రోత్సహించి మిగులు కరెంటును వీధి లైట్లకు వాడుకొనే అవకాశం కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యా ణ్‌ సూచించారు. దీనికి సీఎం అంగీకరించారు. కాగా, పేదల జీవితాల్లో వెలుగు నింపేలా ఉద్యోగ, ఉపాధి కల్పన అవకాశాలను విస్తరించడానికి అనువైన పాలసీలను ఖరారు చేయడంపై చంద్రబాబు కృషిని అభినందిస్తూ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ పాలసీల ఆమోదానికి 40, 50 గంటలు కూర్చోవాల్సి వచ్చిందని సీఎం చెప్పారు.

‘మార్కెట్‌ సెస్‌ వసూలు’పైౖ దర్యాప్తు

కేబినెట్‌ సమావేశంలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ‘గ్రామీణ రోడ్ల మరమ్మతుల కోసం గత వైసీపీ హయాం లో మార్కెట్‌ సెస్‌ వసూలు చేశారు. ఆ డబ్బును వేర్‌హౌసిం గ్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేసి దానిద్వారా రుణం తీసుకోవాలని భావించారు. రోడ్ల రిపేర్లకు టెండర్లు పిలిచి పనులు ఇచ్చారు. కానీ బిల్లుల చెల్లింపునకు ఖాతా తెరవలేదు. ఖాతా లేకుండా ఈ పనులకు పైసా ఇవ్వడం సాధ్యం కాదు. వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు ఇచ్చిన నిధులు తీసుకోవడానికి కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ డబ్బులు వెనక్కు తీసుకోవడం వీలు కాదు’ అని సంబంధిత అధికారి ఒకరు వివరించారు. దీనిపై కేబినెట్‌ దర్యాప్తునకు ఆదేశించింది.

Updated Date - Oct 17 , 2024 | 05:27 AM