ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

jntu vc అవకాశాలను సద్వినియోగం చేసుకోండి

ABN, Publish Date - Sep 28 , 2024 | 11:34 PM

జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యనభ్యసించిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఇనచార్జ్‌ వీసీ సుదర్శనరావు అన్నారు.

ఫ్రెషర్స్‌డేలో వీసీ సుదర్శనరావు

అనంతపురం సెంట్రల్‌, సెప్టెంబరు 28: జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యనభ్యసించిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఇనచార్జ్‌ వీసీ సుదర్శనరావు అన్నారు. శనివారం కళాశాల ఆడిటోరియంలో ఫ్రెషర్స్‌డే నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ చెన్నారెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఫ్రెషర్స్‌డేకు ముఖ్య అతిథిగా వీసీ సుదర్శనరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వీసీ మాట్లాడుతూ దేశ, విదేశాల్లో జేఎనటీయూ పూర్వపు విద్యార్థులు పలురంగాల్లో ఉన్నత శిఖరాలను అందుకున్నారన్నారు. పాఠ్యాంశాల బోధన, ల్యాబ్‌ల సౌకర్యం అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఉందన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ వసుంధ, ప్రొఫెసర్లు ఆనందరావు, విజయకుమార్‌, నాగప్రసాద్‌నాయుడు, శేఖర్‌ రాజు, శివకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2024 | 11:34 PM