ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మొత్తం పరిహారం చెల్లించాల్సిందే

ABN, Publish Date - Dec 01 , 2024 | 11:50 PM

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2021 ఖరీ్‌ఫలో ఓ కంపెనీకి చెందిన నాసిరకం విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, మొత్తం రూ.23 కోట్ల నష్టపరిహారాన్ని కంపెనీ నుంచి చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ

కర్నూలు అగ్రికల్చర్‌, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2021 ఖరీ్‌ఫలో ఓ కంపెనీకి చెందిన నాసిరకం విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, మొత్తం రూ.23 కోట్ల నష్టపరిహారాన్ని కంపెనీ నుంచి చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. కర్నూలు నగరంలోని రైతు సంఘం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.23 కోట్ల నష్టపరిహారంలో కోత పెట్టి రైతులకు అన్యాయం చేసేలా అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందని, అదే జరిగితే.. రైతులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలో 17 మండలాల్లో 7,255 ఎకరాల్లో ఓ కంపెనీకి చెందిన విత్తనాలను పొలాల్లో నాటుకుని రైతులు నష్టపోయారని, వారికి కచ్చితంగా నష్టపరిహారం చెల్లించాల్సిందేనని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి 2021లోనే ప్రభుత్వానికి నివేధిక పంపినట్లు తెలిపారు. పరిహారంలో కోత అంగీకరించబోమని, మొత్తం పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.

Updated Date - Dec 01 , 2024 | 11:50 PM