రైతుల ఖాతాల్లో నిధులు వెంటనే జమ చేయాలి
ABN, Publish Date - May 16 , 2024 | 03:42 AM
గత ఖరీఫ్ సీజన్‌లో కరవు, తుపాను, భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కింద చెల్లించాల్సిన రూ.1,294 కోట్ల నిధులను తక్షణమే
సీఎస్‌కు రాష్ట్ర రైతు సంఘం లేఖ
అమరావతి, మే 15 (ఆంధ్రజ్యోతి): గత ఖరీఫ్ సీజన్‌లో కరవు, తుపాను, భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కింద చెల్లించాల్సిన రూ.1,294 కోట్ల నిధులను తక్షణమే బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎ్‌స.జవహర్‌రెడ్డికి బుధవారం లేఖ రాశారు. ఈ నిధుల విడుదలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గత మార్చి 6వ తేదీనే బటన్ నొక్కారని, కానీ ఇంతవరకు చెల్లింపులు జరగలేదని తెలిపారు.
Updated Date - May 16 , 2024 | 07:40 AM